శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Modified: సోమవారం, 2 మార్చి 2015 (15:07 IST)

మార్చి 7 నుంచి 27 వరకూ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలు నిర్వహించడానికి సిద్ధమవుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 7 నుంచి 27 వరకూ నిర్వహించనున్నారు. ఈ మేరకు బిజినెస్ అడ్వజరీ కమిటీ ఈ మేరకు నిర్ణయించింది. కీలక అంశాలను ఈ సమావేశంలో చర్చించనున్నారు. వివరాలిలా ఉన్నాయి. 
 
కేంద్ర బడ్జెట్ ప్రకటన వెలువడిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మార్చి 7 నుంచి బడ్జెట్ సమావేశాలను నిర్వహించనున్నది. ఈ సమావేశాలు కనీసం 21 రోజులు జరుగనున్నాయి. ఇందులో భాగంగా బిఏసి ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ఈ నెల 12న శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నది. 
 
అదే విధంగా మార్చి 13న వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. సమావేశాల ప్రారంభం సందర్భంగా మార్చి 7న రాష్ట్ర గవర్నర్ ఈఎల్ నరసింహన్ ప్రసంగం ఉంటుంది. బడ్జెట్ సమావేశాలకు అనుగుణంగా ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు విభాగాల నుంచి వివరాలు తెప్పించుకునే పనిలో పడ్డారు. లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రం బడ్జెట్ ఏ విధంగా ఉండబోతుందో వేచి చూడాల్సిందే.