శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By JSK
Last Modified: శనివారం, 27 ఆగస్టు 2016 (13:44 IST)

సాయం చేయ‌క‌పోగా రివ‌ర్స్ వాయింపుడు... బాబును పుష్క‌ర లెక్క‌లు అడుగుతున్న బీజేపీ...

విజ‌య‌వాడ ‌: కృష్ణా పుష్క‌రాల‌కు అంత ఎక్కువ ఎందుకు ఖ‌ర్చు చేశారు... అస‌లు లెక్క‌లు చెప్పండి... శ్వేత ప‌త్రం విడుద‌ల చేయండి... ఏపీ సీఎం చంద్ర‌బాబును ఇలా ప్ర‌శ్నిస్తోంది... వైసీపీ నేత జ‌గ‌న్ కాదు... టీడీపీతో జ‌త‌క‌ట్టిన మిత్ర‌ప‌క్షం బీజేపీనే. అస‌లే రాష

విజ‌య‌వాడ ‌: కృష్ణా పుష్క‌రాల‌కు అంత ఎక్కువ ఎందుకు ఖ‌ర్చు చేశారు... అస‌లు లెక్క‌లు చెప్పండి... శ్వేత ప‌త్రం విడుద‌ల చేయండి... ఏపీ సీఎం చంద్ర‌బాబును ఇలా ప్ర‌శ్నిస్తోంది... వైసీపీ నేత జ‌గ‌న్ కాదు... టీడీపీతో జ‌త‌క‌ట్టిన మిత్ర‌ప‌క్షం బీజేపీనే. అస‌లే రాష్ట్రం క్లిష్ట‌ప‌రిస్థితుల్లో ఉంది. ఇలాంటి స‌మ‌యంలో కృష్ణా పుష్క‌రాలంటూ, దాదాపు రెండు వేల కోట్ల రూపాయ‌లు ఎలా ఖ‌ర్చు చేశారంటూ బీజేపీ నాయ‌కులు టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడును విమర్శిస్తున్నారు.
 
బీజేపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎస్. సురేష్ రెడ్డి కృష్ణా పుష్క‌రాల ఖ‌ర్చుపై ఏపీ ప్ర‌భుత్వాన్ని నిల‌దీశారు. దీనిపై శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేశారు. ఏడాది క్రితం గోదావ‌రి పుష్క‌రాలు 1800 కోట్ల రూపాయ‌ల‌తో నిర్వ‌హించి, ఇపుడు కృష్ణా పుష్క‌రాలు 1600 కోట్ల రూపాయ‌ల‌కు పైగా ఖ‌ర్చు చేయాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింద‌ని ప్ర‌శ్నించారు. విభ‌జ‌న త‌ర్వాత ఎంతో ఆర్ధిక సంక్షోభంతో ఉన్న ఏపీ ప్ర‌భుత్వం ఇంత పెద్ద మొత్తం ఖ‌ర్చు ఎలా చేసింద‌ని ఆక్షేంపించారు. 
 
12 రోజుల పుష్క‌రాల కోసం, నాణ్య‌త లేని టెంప‌ర‌రీ ప‌నులు ఎటువంటి లెక్కా ప‌త్రాలు లేకుండా, నామినేష‌న్ ప‌ద్ధ‌తిలో చేశార‌ని, ఇది రాష్ట్ర ఖ‌జానాకు మేలా అనేది ఏపీ సీఎం చంద్ర‌బాబు ఒక‌సారి ఆలోచించాల‌ని బీజేపీ నేత‌లు పేర్కొంటున్నారు. ఇలా అయితే ఇక కేంద్రం ఏపీకి ఎంత సాయం చేసినా ప్ర‌యోజ‌నం ఏముంద‌ని ప్ర‌శ్నిస్తున్నారు. అయితే, టీడీపీ నేత‌లు దీనిపై సీరియ‌స్‌గానే స్పందిస్తున్నారు. కేంద్రం ఏపీకి త‌గిన సాయం చేయ‌క‌పోగా, ఈ రివ‌ర్స్ వాయింపుడు ఏంట‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.