చంద్రబాబు చేతకానితనం... 2019లో సత్తా చూపిస్తా: కన్నా లక్ష్మీనారాయణ

మంగళవారం, 15 మే 2018 (13:07 IST)

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమించినందుకు అమిత్ షా, మోడీకి ధన్యవాదాలు తెలియజేశారు కన్నా లక్ష్మీనారాయణ, ఇప్పుడు ఏపీలో ప్రత్యేక పరిస్థితులు నెలకొని ఉన్నాయి అని తెలియజేశారు. ప్రధాని మోడీ, బీజేపీపై అసత్యాలతో కూడిన దుష్ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర ప్రజల సమస్యలను గాలికొదిలేసి, బీజేపీపై దుష్ప్రచారం చేస్తూ 2019 ఎన్నికల్లో లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నాయి. 
Kanna
 
2019 ఎన్నికల్లో మోడీ నేతృత్వంలో అవినీతి రహిత, సుపరిపాలన అందించబోతున్నాం. విభజన చట్టంలో 10 సంవత్సరాల అంశాలను నాలుగు సంవత్సరాల్లోనే హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చించింది. చంద్రబాబు చేతగానితనంతో, అవినీతితో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందే తప్ప కేంద్రం విఫలం కాలేదు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బీజేపీ ఎప్పుడూ కట్టుబడి ఉంది. ఏపీలో బీజేపీ బలోపేతానికి అందరిని కలుపుకొని పనిచేస్తానని తెలియజేశారు కన్నా.
 
మెత్తబడిన సోము వీర్రాజు
బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయంతో కినుకు వహించిన సోము వీర్రాజు మెత్తబడ్డారు. పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి రాష్ట్రంలో కార్యకర్తలను, పార్టీని బలోపేతం చేస్తానని బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయానికి సోము వీర్రాజు లేఖ రాశారు. అధిష్టానం నిర్ణయమే శిరోధార్యం, రాబోయే రోజులు చాలా విలువైనవి అందుకే పార్టీ బలోపేతం కావాల్సిన సమయం‌ ఆసన్నమైందంటూ లేఖలో పేర్కొన్నారు.దీనిపై మరింత చదవండి :  
Chandrababu Naidu Kanna Lakshmi Narayana Ap Bjp President

Loading comments ...

తెలుగు వార్తలు

news

కింగూ కాదు.. మేకూ కాదు :: ఓట్లలో 2 శాతం కోత.. జేడీఎస్‌కు 40 సీట్లు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత జనతా దళ్ సెక్యులర్ (జేడీఎస్) పార్టీ కీలకపాత్ర ...

news

#KarnatakaElectionResults2018 : కాంగ్రెస్ "ముక్త్ భారత్" తథ్యమా?

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన "కాంగ్రెస్ ముక్త్ భారత్" పిలుపు సార్ధకమయ్యేలా ...

news

#KarnatakaVerdict : సీఎం సిద్ధరామయ్య ఓటమి

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఓటమిపాలయ్యారు. ఈ ...

news

కర్నాటకలో కాంగ్రెస్ పార్టీకి తెలుగువాడి దెబ్బ పడిందా? కాంగ్రెస్ పరాజయానికి 5 కారణాలు(Video)

కాంగ్రెస్ పార్టీ దేశంలో క్రమంగా కనుమరుగైపోయే రోజులు వచ్చేసినట్లు కనబడుతున్నాయి. ...