శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: శుక్రవారం, 24 ఫిబ్రవరి 2017 (16:08 IST)

నన్ను మంత్రి పదవి నుంచి తీసేస్తారా! ఏం చెయ్యాలో నాకు తెలుసు...

ఎపిలో త్వరలో మంత్రివర్గ విస్తరణ జరుగబోతున్న సంగతి తెలిసిందే. అందరి చూపు మంత్రి పదవుల వైపే. పార్టీలో ఉన్నవారు.. వేరే పార్టీ నుంచి జంప్ అయిన వాళ్ళు.. ఇలా ఒకరు కాదు.. సీనియర్లందరూ క్యూ కట్టారు. అధినేత చంద్రబాబునాయుడు దృష్టిలో ఎలా పడాలో అలా అన్ని విధాలుగ

ఎపిలో త్వరలో మంత్రివర్గ విస్తరణ జరుగబోతున్న సంగతి తెలిసిందే. అందరి చూపు మంత్రి పదవుల వైపే. పార్టీలో ఉన్నవారు.. వేరే పార్టీ నుంచి జంప్ అయిన వాళ్ళు.. ఇలా ఒకరు కాదు.. సీనియర్లందరూ క్యూ కట్టారు. అధినేత చంద్రబాబునాయుడు దృష్టిలో ఎలా పడాలో అలా అన్ని విధాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ చివరకు ఫైనల్ నిర్ణయం బాబుదే. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ కొంతమందికి పదవులు పోయే పరిస్థితి కనిపిస్తోంది. మంత్రి పదవి పోయే మొదటి జాబితాలో మొదటి పేరు చిత్తూరు జిల్లాకు చెందిన అటవీశాఖామంత్రి బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డే వున్నారనే చర్చ సాగుతోంది. 
 
ఈ విషయం ఇన్నిరోజులుగా ఆయన గాసిప్స్ అని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారట. అయితే కొంతమంది నేతలు ఈ విషయాన్ని పెద్దగా ప్రస్తావించడంతో బొజ్జలకు ఒక్కసారిగా చిర్రెత్తుకొచ్చిందట. మంత్రి పదవి నుంచి తీసేస్తారా... ఐతే నాకు ఏం చేయాలో తెలుసు. నేను పార్టీలో ఎన్ని సంవత్సరాలు పనిచేసినా, పార్టీకి ఎంత సేవ చేశానో... చివరకు బాబుతో కలిసి వెళుతూ ప్రాణం పోగొట్టుకునేవరకూ వెళ్లా.. ఇది ఎవరో చెప్పిన మాట కాదు. సాక్షాత్తు బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డి తన అనుచరులతో చెప్పిన మాటలట.
 
తన స్వగ్రామం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని ఊరందూరులో ఈ మాటలు చెప్పుకొచ్చారట బొజ్జల. కొన్ని రోజుల క్రితం అమరావతికి వెళ్ళినప్పుడు కొంతమంది బొజ్జలను హేళనగా మాట్లాడారట. మొదట్లో పెద్దగా పట్టించుకోని బొజ్జల, ఒక్కసారిగా కోపం ఎక్కువైందట. మీరు చెప్పినట్లంతా జరుగదు. ఏం జరుగుతుందో చూడండి అంటూ కోపడ్డారట. ఇదే విషయాన్ని తన స్వగ్రామంలో అనుచరులకు చెప్పారట. మొత్తం మీద మంత్రి పదవి నుంచి బొజ్జలను తీసేస్తే ఏం చేస్తారోనని భయపడిపోతున్నారు ఆయన అనుచరులు. ఏం చేస్తారో?