గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: బుధవారం, 27 మే 2015 (13:26 IST)

ఏపీ రాజధాని ప్లాన్... సింగపూర్ కాపీ కొట్టి తెచ్చిందా...? ఆస్ట్రేలియా కాన్బెర్రా నగరం అంతేనట...

పరీక్షల్లో పిల్లలు కాపీ కొడుతుంటారు. అలాగే కొన్ని ప్రాజెక్టులను ఇతర కంపెనీలు కాపీలు కొడుతుంటాయి. ఇంకా సినీ ఇండస్ట్రీలోనూ ఒకరి కథను ఇంకొకరు కాపీ కొట్టేసి హిట్టులు కొట్టేస్తుంటారు. ఇలా కాపీల గొడవ ఈరోజుల్లో చాలా ఎక్కువయిపోయింది. ఇంతకీ ఈ కాపీ గోల ఏంటయా అంటారా...? అక్కడే వస్తున్నా... మరేం లేదండీ, ఏపీ ప్రభుత్వం రాజధాని ప్లాన్ వచ్చేసిందంటూ తెగ సంబరపడిపోతోంది కదా. పైగా సింగపూర్ ప్రభుత్వం ఇచ్చిందని చాలా గొప్పగా చెప్పుకుంటోంది. కానీ ఈ ప్లాన్ కాపీ కొట్టి తెచ్చిందనే టాక్ వినిపిస్తోంది. 
 
విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆస్ట్రేలియాలోని కాన్బెర్రా నగరం రూపురేఖలు అచ్చుగుద్దినట్లు ఇప్పుడు సింగపూర్ ఏపీ రాజధాని అమరావతి నగర నిర్మాణానికి ఇచ్చిన దానికి పోలినట్లు ఉన్నదని అనుకుంటున్నారు. ఎంతో గొప్పగా రాజధాని ప్లాన్ వున్నదని చెప్పుకుంటున్న ఏపీ ప్రభుత్వానికి ఇలాంటి వార్త కొద్దిగా షాకింగ్ ఇచ్చేదే. ఇదే నిజమైతే కనుక ఇక ప్రతిపక్షాలు తెదేపా ప్రభుత్వాన్ని ఏకేందుకు రెడీ అయిపోతాయి మరి. కాపీ ప్లాన్ కోసం సింగపూర్ దేశానికి ప్రత్యేక విమానంలో వెళ్లి రావాలా... అని ఎగతాళి కూడా చేస్తారు మరి. చూడాలి ఏం జరుగుతుందో...?