నారావారిపల్లిలో కుటుంబ సభ్యుల బాబు సంక్రాంతి వేడుకలు

శనివారం, 14 జనవరి 2017 (13:57 IST)

టీడీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యుల మధ్య సంక్రాంతి వేడుకలు జరుపుకున్నారు. ప్రతియేటా కుటుంబ తన స్వగ్రామం నారావారిపల్లిలోనే సంక్రాంతి వేడుకలను బాబు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెల్సిందే. ఇందుకోసం ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి నారావారిపల్లెకు భోగికి ముందు రోజే చేరుకుంటారు. ఈ యేడాది కూడా అలానే స్వగ్రామానికి వెళ్లారు.
chandrababu
 
సంక్రాంతి వేడుకల్లో భాగంగా ముందుగా ఆయన తన తల్లిదండ్రులు ఖర్జూరానాయుడు, అమ్మణ్ణమ్మ సమాధుల వద్ద పూజలు నిర్వహించారు. అనంతరం ఎన్‌టిఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నారావారిపల్లి గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు బాబు. గంటకుపైగా గ్రామస్తులతో బాబు గడిపారు. నారావారిపల్లిలో చంద్రబాబునాయుడుతో పాటు ఆయన సతీమణి నారా భువనేశ్వరి, నారా లోకేష్‌, బ్రహ్మిణి, నారా రోహిత్‌లు కూడా ఉన్నారు. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

తెలుగుదేశం పార్టీని చిరంజీవి టార్గెట్ చేశారు... ఎలా...?

మెగాస్టార్ చిరంజీవి. పదేళ్ళ పాటు రాజకీయాల్లో ఉండి చివరకు తాను కింగ్‌గా ఉన్న ...

news

మంత్రి ఇలాకాలో అధికార పార్టీలో ఆధిపత్య పోరు... చంద్రబాబుకు తలనొప్పి!

సాక్షాత్తు మంత్రి ఇలాకాలోనే అధికారపార్టీలలో ఆధిపత్య పోరు జరుగుతోంది. అది కూడా ఎక్కడో కాదు ...

news

మద్యం సేవంచే రాజకీయ నేతలను ఉరితీయాలి : సెనేటర్ షాహీ సయ్యద్

పాకిస్థాన్ దేశంలోని అవామీ నేషనల్ పార్టీకి చెందిన షాహీ సయ్యద్ అనే సెనేటర్ ఓ సంచలన ప్రకటన ...

news

బెంగుళూరులో 'నిర్భయ' ఘటన.. 'లవ్‌ లెటర్‌ ఇస్తే చిల్లర ఇస్తా'నన్న కండక్టర్... డ్రైవర్ వత్తాసు

దేశ ఐటీ రాజధాని బెంగుళూరులో మరో నిర్భయను తలపించే భయానక చర్య ఒకటి జరిగింది. డిసెంబర్ 31వ ...