గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By JSK
Last Modified: శనివారం, 25 జూన్ 2016 (13:15 IST)

నేను చైనా వెళ్ళొచ్చేస‌రికి ప్ర‌కృతి పిల‌వాలి: అధికారుల‌కు చంద్ర‌బాబు ఉద్బోధ‌!

విజ‌య‌వాడ‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ‘ప్రకృతి పిలుస్తోంది’ అనే కార్యక్రమం ప్రారంభిస్తున్నామ‌ని, వినూత్నంగా ఈ కార్యక్రమాన్నిముందుకు తీసుకెళ్లాల‌ని, అధికారులు, ప్రజాప్రతినిధులతో టెలీ కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. మనిషికి 10 మొక్

విజ‌య‌వాడ‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ‘ప్రకృతి పిలుస్తోంది’ అనే కార్యక్రమం ప్రారంభిస్తున్నామ‌ని, వినూత్నంగా ఈ కార్యక్రమాన్నిముందుకు తీసుకెళ్లాల‌ని, అధికారులు, ప్రజాప్రతినిధులతో టెలీ కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. మనిషికి 10 మొక్క‌ల చొప్పన 5 కోట్ల మంది పెంచితే రాష్ట్రవ్యాప్తంగా 50 కోట్ల చెట్లు పెంచవచ్చ‌న్నారు. ఒకే రోజు కోటి మొక్కలు నాటుదాం. 
 
తను చైనా వెళ్లి వచ్చేసరికి ప్ర‌కృతి పిలుస్తోంది కింద పంట కుంటల తవ్వకం, జల సంరక్షణ పనులు, మొక్కల పెంపకం, సిమెంటు రోడ్లు/మరుగుదొడ్ల నిర్మాణంలో సీరియస్‌నెస్ ఎక్కడా తగ్గకూడద‌ని పేర్కొన్నారు. నీటి భద్రత, చెట్లు పెంచడం, సిమెంటు రోడ్ల నిర్మాణం, మరుగుదొడ్ల నిర్మాణం, గ్రామ గ్రామాన కంపోస్టు యూనిట్ల ఏర్పాటు... ఈ 5 పర్యావరణ పరిరక్షణలో పంచశీల సూత్రాల‌ని చంద్రబాబు వివ‌రించారు. 
 
రాష్ట్రంలో ప్రస్తుతం అటవీ విస్తీర్ణం 26% ఉంది, దానిని 50%కు పెంచాలనే లక్ష్యంతో అధికార యంత్రాంగం ప‌నిచేయాల‌ని సూచించారు. సొగసు పెరిగితే పర్యాటకులు పెరుగుతారు. దానివల్ల రాష్ట్రానికి రాబడి పెరగడంతోపాటు జాతీయంగా, అంతర్జాతీయంగా రాష్ట్రానికి పేరువస్తుంద‌న్నారు. రాష్ట్రంలో ప్రతి వాగు, ప్రతి వంక ఒక చిన్న రిజర్వాయర్‌గా మారాలి. మూడోవంతు భూగర్భ జలం పెంచితే రూ.2,000 కోట్లు ఆదా చేసినట్లు అవుతుంద‌ని సీఎం చెప్పారు.