గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By JSK
Last Modified: శనివారం, 27 ఆగస్టు 2016 (13:31 IST)

చంద్ర‌బాబు చుర‌క‌లు... మంత్రుల ప‌రుగులు... అమ‌రావ‌తిలో కార్యాల‌యాలు...

అమ‌రావ‌తి : నిద్ర‌పోను... నిద్ర‌పోనివ్వ‌ను... ఇదీ ఏపీ సీఎం చంద్ర‌బాబు వ‌ర్క్ స్ట‌యిల్... కృష్ణా పుష్క‌రాల కోసం అహ‌ర్నిశ‌లు శ్ర‌మ‌ప‌డిన ఏపీ యంత్రాంగం... ఆ 12 రోజుల సంబ‌రం ముగిశాక‌... రిలాక్స్ కాకూడ‌దు అనేది సీఎం అభిప్రాయం. అందుకే, మంత్రుల‌కు చుర‌క‌లు

అమ‌రావ‌తి :  నిద్ర‌పోను... నిద్ర‌పోనివ్వ‌ను... ఇదీ ఏపీ సీఎం చంద్ర‌బాబు వ‌ర్క్ స్ట‌యిల్... కృష్ణా పుష్క‌రాల కోసం అహ‌ర్నిశ‌లు శ్ర‌మ‌ప‌డిన ఏపీ యంత్రాంగం... ఆ 12 రోజుల సంబ‌రం ముగిశాక‌... రిలాక్స్ కాకూడ‌దు అనేది సీఎం అభిప్రాయం. అందుకే, మంత్రుల‌కు చుర‌క‌లు వేశారు. మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ కాదు... ముందు ఉన్న‌వారు స‌రిగా ప‌నిచేసి చూపండి అంటూ క్లాస్ ఇచ్చారు. దీనితో ఇపుడు ఏపీ మంత్రులు, యంత్రాంగం ప‌రుగులు తీస్తున్నారు. 
 
ఏపీ పాల‌న‌ను హైద‌రాబాదు నుంచి అమ‌రావ‌తికి తీసుకురావాల‌నే ల‌క్ష్యాన్ని మ‌ళ్ళీ లైమ్‌లైట్ లోకి తీసుకొస్తున్నారు. క్ర‌మేపీ ఏపీ మంత్రిత్వ శాఖ‌ల కార్యాల‌యాల‌ను అటు అమ‌రావ‌తిలో, ఇటు విజ‌య‌వాడ‌లో ఏర్పాటు చేసే ప‌నిలో ప‌డ్డారు. వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావు త‌న మంత్రిత్వ శాఖ పేషీని శ‌నివారం లాంఛ‌నంగా ప్రారంభించారు. 
 
కొబ్బ‌రికాయ కొట్టి పేషీని వేద మంత్రోచ్చార‌ణ మ‌ధ్య ఆరంభించారు. ఇక రాష్ట్ర జలవనరుల శాఖ కార్యాలయం కొత్త రాజధాని అమరావతి వెలగపూడి సచివాలయంలొ ప్రారంభం కానుంది. ఆదివారం 4వ బ్లాక్ లోని మొదటి అంతస్తులో ఉద యం 8.52 గంటలకు మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రారంభిస్తారు. ఇలా దాదాపు అన్ని కార్యాల‌యాలు ఇక్క‌డికి రావాల‌నేది సీఎం చంద్ర‌బాబు ఆకాంక్ష‌. మ‌రి దానిని మంత్రులు, ఎన్జీవోలు, అధికారులు ఎప్ప‌టికి నెర‌వేరుస్తారో వేచి చూడాలి.