గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: బుధవారం, 21 జూన్ 2017 (21:14 IST)

ఓర్వకల్లు ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి చంద్రబాబు భూమి పూజ

కర్నూలు: ఓర్వకల్లు విమానాశ్రయం ద్వారా జిల్లాకు పూర్వవైభవం రాబోతోందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. బుధవారం ఓర్వకల్ రాక్ గార్డెన్ ఎదురుగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి ముఖ్

కర్నూలు: ఓర్వకల్లు విమానాశ్రయం ద్వారా జిల్లాకు పూర్వవైభవం రాబోతోందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. బుధవారం ఓర్వకల్ రాక్ గార్డెన్ ఎదురుగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి ముఖ్యమంత్రి భూమి పూజ చేశారు. 
 
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ... ఓర్వకల్ ఎయిర్ పోర్ట్ 1110 ఎకరాల్లో 90 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నామన్నారు. వచ్చే ఏడాదికి పనులు పూర్తయి విమానాల రాకపోకలు సాగిస్తాయన్నారు. ఇక్కడి నుంచి చెన్నైకి వెళ్లే అవకాశం వుందన్నారు. 
 
ఈ విమానాశ్రయాన్ని విజయవాడ, తిరుపతి, విశాఖ ఎయిర్ పోర్టుల స్థాయికి తీసుకెళ్తామన్నారు. ఓర్వకల్లు ఎయిర్ పోర్టు కర్నూలుకు 30 కిలో మీటర్లు దూరంలో వుందనీ, ప్రముఖ పుణ్యక్షేత్రాలైన శ్రీశైలం తదితర క్షేత్రాలున్నాయనీ, విమానాశ్రయం పూర్తయితే పర్యాక కేంద్రంగా కర్నూలును అభివృద్ధి చేస్తామన్నారు.