శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By JSK
Last Modified: శుక్రవారం, 24 జూన్ 2016 (16:50 IST)

అమరావతి భూములను ఇలా కేటాయిస్తున్నాం.... సీఎం చంద్రబాబు

విజ‌య‌వాడ‌: స్వీస్ ఛాలెంజ్ విధానంలో అమ‌రావ‌తి క్యాపిట‌ల్ నిర్మాణానికి సింగ‌పూర్‌తో ఒప్పందం కుదుర్చుకున్న‌ట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఏపీ మంత్రివ‌ర్గ స‌మావేశం అనంత‌రం విజ‌య‌వాడ‌లో ఆయ‌న మీడియా స‌మావేశాన్ని నిర్వ‌హించారు.

విజ‌య‌వాడ‌: స్వీస్ ఛాలెంజ్ విధానంలో అమ‌రావ‌తి క్యాపిట‌ల్ నిర్మాణానికి సింగ‌పూర్‌తో ఒప్పందం కుదుర్చుకున్న‌ట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఏపీ మంత్రివ‌ర్గ స‌మావేశం అనంత‌రం విజ‌య‌వాడ‌లో ఆయ‌న మీడియా స‌మావేశాన్ని నిర్వ‌హించారు. నవంబర్ 12, డిసెంబర్ 18 2014న సింగపూర్ వారితో ఎం.ఓ.యు చేశామ‌ని, సంక్షోభన్ని ఎదుర్కోవటానికి ఇతర దేశాలతో ఒప్పందం కుదుర్చుకున్నామ‌న్నారు. 2015 అక్టోబరులో సింగపూర్ అడిగిన స్వీస్ చాలెంజ్ విధానానికి ఈ రోజు క్యాబినేట్ అమోదం తెలిపింద‌న్నారు. దీని ద్వారా అస్సెండ‌ర్స్ సిమ్ బ్ర‌డ్జికి 58%, అమరావతి క్యాపిటల్ పార్టనర్‌కి 42 % శాతం ఉంటుంద‌ని చెప్పారు. 
 
రాజ‌ధానిలో 50 ఎక‌రాలను నామినల్ రేటుకి ఇస్తామ‌ని, ఫేజ్‌లు వారిగా సి.ఆర్.డి.ఏ.లో భూములు కేటాయిస్తామ‌న్నారు. ఫేజ్ 1లో అమరవతి క్యాపిటల్‌కి 200 ఎక‌రాలు కేటాయిస్తామ‌ని, వచ్చిన లాభాల ఆధారంగా విడతల వారిగా మూడు కంపెనీల‌కు భూములు కేటాయిస్తామ‌న్నారు.
 
అభద్రతా భావాన్ని సృష్టించడం పత్రికలకి భావ్యం కాదు...
రాజ‌ధాని విష‌యంలో అభద్రతా భావాన్ని సృష్టించడం పత్రికలకి భావ్యం కాద‌ని, ప్రజలలో అభద్రత భావం క్రియేట్ చేస్తే సహించన‌ని, ప‌త్రికలు నిజాన్ని తేలియజేయాల‌న్నారు చంద్ర‌బాబు. 200 ఎక‌రాలు, ఎక‌రానికి 4 కోట్ల రూపాయిలికిస్తామ‌ని, ఇండొ-యూకే ఇనిస్టిట్యూట్‌కి 150 ఎక‌రాలు, ఎక‌రం 50 లక్షలకు ఇస్తున్నామ‌ని సీఎం చెప్పారు. విఐటికి 200 ఎక‌రాలు ఎక‌రం 50 లక్షలకు ఇస్తున్నామ‌ని, ఇలాగే citdaకి 5 ఎక‌రాలు, అప్రెడాకు 25 ఎక‌రాలు, టీటీడీకి 25 ఎక‌రాల భూములు కేటాయించ‌డానికి నిర్ణయం తీసుకున్నామ‌న్నారు. 
 
వెలిగొండ ప్రాజెక్ట్ పనులకి 60% అడ్వాన్సుగా 25 కోట్ల20 లక్షలు కేటాయిస్తున్నామ‌న్నారు. 4 అగ్రికల్చర్ యూనివర్సీటీలు 4 ఫీషరీ యూనివర్సీటీలు ఏర్పాటు చేస్తున్నామ‌ని, నెల్లూరులో ఏడు ఎక‌రాలు మీనక్షీ ప‌వ‌ర్‌‌కి 30 సంవ‌త్సారాల లీజుకి ఇస్తున్నామ‌న్నారు. apiscకి భోగపూరంలో 350 ఎక‌రాలు కేటాయిస్తున్నామ‌న్నారు. మాజీ సైనికులు 10 సంవత్సరాలు దాటితే ఎన్.ఓ.సి అవసరం లేకుండా భూములు అమ్ముకోవ‌చ్చ‌ని సీఎం రిలాక్సేష‌న్ ఇచ్చారు.