బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: మంగళవారం, 10 జనవరి 2017 (18:06 IST)

నేను తినే తిండి మీకు దొరకదా అని అడుగుతున్నా... నెల్లూరులో సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం నాడు నెల్లూరు జిల్లాలో పర్యటించారు. అక్కడ పలు అభివృద్ధి పథకాలపై సమీక్ష చేశారు. అనంతరం ప్రజలతో తన ఆరోగ్య రహస్యం గురించి చెప్పారు. తను రోజూ ఉదయం కాస్త అల్పాహారం తీసుకుంటాననీ, ఆ తర్వాత మధ్యాహ్నం వేళలో అ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం నాడు నెల్లూరు జిల్లాలో పర్యటించారు. అక్కడ పలు అభివృద్ధి పథకాలపై సమీక్ష చేశారు. అనంతరం ప్రజలతో తన ఆరోగ్య రహస్యం గురించి చెప్పారు. తను రోజూ ఉదయం కాస్త అల్పాహారం తీసుకుంటాననీ, ఆ తర్వాత మధ్యాహ్నం వేళలో అన్నం, కుదిరితే చేపలు తింటుంటాని అన్నారు. 
 
ఆయన మాటల్లోనే... "మీరు కూడా చేపలు బాగా తినాలి. మీ పిల్లలకు చేపలు పెట్టండి. చేపలు తింటే జ్ఞాపకశక్తి బాగా పెరుగుతుంది. కాబట్టి పిల్లలకు చేపలు ఖచ్చితంగా పెడుతూ ఉండాలి. ఇక నా సంగతికి వస్తే రాత్రిపూట కాస్త లైట్ గా టిఫిన్ తీసుకుని ఒక సూప్ తాగుతాను. ఆ తర్వాత పడుకోబోయే ముందు పాలు తాగుతాను. ఇప్పుడు మిమ్మిల్ని అడుగుతున్నా. నేను తినే తిండి మీకు దొరకదా అని అడుగుతున్నా అంటూ ప్రజలను ప్రశ్నించారు.