Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

జన్మభూమిని మరిచిపోయిన వారు మనుషులే కాదు: చంద్రబాబునాయుడు

మంగళవారం, 16 జనవరి 2018 (13:32 IST)

Widgets Magazine
chandrababu

చిత్తూరు జిల్లా నారావారిపల్లిలో పలు అభివృద్థి కార్యక్రమాలను ప్రారంభించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు. 6 కోట్ల రూపాయలతో నిర్మించిన సామాజిక ఆరోగ్య కేంద్రం, నారావారిపల్లి నుంచి పుదిపట్లకు నాలుగురోడ్ల విస్తరణ పనులను ప్రారంభించారు. చిత్తూరు జిల్లాను అన్నివిధాలుగా అభివృద్థి చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. మదనపల్లి టమోటా హబ్‌గా మారుతోందని, కుప్పంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను త్వరలో ప్రారంభిస్తామని, హంద్రీ-నీవా ద్వారా వచ్చే సంవత్సరంలో తాగు, సాగునీరు అందిస్తామని, సోమశిల-స్వర్ణముఖి, బాలాజీరిజర్వాయర్, స్వర్ణముఖి రిజర్వాయర్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని చెప్పారు. 
 
గ్రామస్థాయిలో పర్యాటక శాఖను అభివృద్ధి చేస్తామని, సాంప్రదాయాలు ఫాలో కాకుండా, వారసత్వాలు వదులుకుంటే ఇబ్బంది పడతారని, సంస్కృతి, సాంప్రదాయాలు కాపాడుకోవాలి, అదే మనకు ఆస్తి అని, జన్మభూమికి సేవలందించాలని, కరువు రహిత జిల్లాగా చిత్తూరును మారుస్తామని చెప్పారు. జన్మభూమిని మరిచిపోయిన వారు మనుషులే కాదని అన్నారు. నెల్లూరులో ఎయిర్‌పోర్ట్ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని, ఎపిలోని అర్హులైన నిరుపేదలందరికీ ఇళ్ళస్థలాలు, ఇళ్ళనిర్మాణం చేపట్టి అందిస్తామని, మారుమూల గ్రామాల్లో నిరంతర విద్యుత్ సరఫరాను అందిస్తామని చెప్పారు. 
 
ఈ నెల 26వ తేదీన వైజాగ్‌లో పెట్టుబడిదారులతో సమావేశం నిర్వహిస్తామని, ఎపిలో కొత్త పరిశ్రమల ఏర్పాటు కోసం పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలన్నారు. ఎపిలో ప్రభుత్వ ఉద్యోగులకు పెద్దపీట వేశామని, నకిలీ విత్తనాలు, క్రిమిసంహారక మందులను సరఫరా చేసే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

అమ్మోరు జాతరలో అమ్మాయిల న్యూడ్ డాన్సులు

గ్రామ దేవత జాతర పేరుతో అమ్మాయిలు అర్థనగ్న డాన్సులు వేశారు. అదీకూడా పండగ పూట ఈ పాడు పని ...

news

బోరున విలపించిన ప్రవీణ్ తొగాడియా... ఎన్‍కౌంటర్ చేస్తారని భయం...

తనను ఎన్‌కౌంటర్ చేయొచ్చు అని విశ్వహిందూ పరిషత్ అగ్రనేత ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు ...

news

ప్రపంచ యుద్ధానికి కేవలం ఒక్క అడుగు దూరంలోనే వున్నాం: పోప్

ఉత్తర కొరియా అణు పరీక్షలు, అమెరికా నిరసన.. చైనా, పాకిస్థాన్‌తో భారత్ సరిహద్దు సమస్యలు ...

news

క్రైమ్ రేట్‌లో టాప్-3-హర్యానాలో ఘోరం: 24 గంటల్లో నాలుగు అత్యాచారాలు

దేశంలో మహిళలపై నేరాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వయోభేదం లేకుండా మహిళలపై జరుగుతున్న నేరాలను ...

Widgets Magazine