గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By JSK
Last Modified: గురువారం, 5 మే 2016 (20:13 IST)

ప్రత్యేక హోదాపై ఇప్పటికే అరుణ్ జైట్లీ, వెంకయ్యలను అడిగేశా... చంద్ర‌బాబు

ప్రత్యేక హోదాపై ఏపీ సీఎం చాలా టెన్ష‌న్ ప‌డుతున్నారు. రాద‌ని కేంద్ర మంత్రులు చేసిన వ్యాఖ్య‌ల‌పై ఇప్పటికే తాను అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడులను అడిగేశానని చంద్ర‌బాబు చెప్పారు. ఏపికి ఏమిస్తారో స్పష్టత ఇవ్వండి, దాన్నిబట్టి ఎలా ముందుకెల్లాలో ప్రణాళిక రూపొం

ప్రత్యేక హోదాపై ఏపీ సీఎం చాలా టెన్ష‌న్ ప‌డుతున్నారు. రాద‌ని కేంద్ర మంత్రులు చేసిన వ్యాఖ్య‌ల‌పై ఇప్పటికే తాను అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడులను అడిగేశానని చంద్ర‌బాబు చెప్పారు. ఏపికి ఏమిస్తారో స్పష్టత ఇవ్వండి, దాన్నిబట్టి ఎలా ముందుకెల్లాలో ప్రణాళిక రూపొందించుకుంటాం అని కేంద్రానికి చెప్పానన్నారు. తెలంగాణ కొత్త ప్రాజెక్టులు కడితే ఏపికి అన్యాయం జరుగుతుంది అంటే తెలంగాణ సిఎంకు కోపం వస్తుందిగాని, వాస్త‌వాలు తామే మాట్లాడ‌తామన్నారు. 
 
హైదరాబాదును కష్టపడి అభివృద్ధి చేస్తే ఏపికి ఆదాయంతో సంబంధం లేకుండా విభజన చేసి బయటకి పంపార‌ని ఏపీ సీఎం ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సింగవరం సభలో ఏపీ సీఎం మాట్లాడుతూ, రాజకీయ లబ్ధి కోసమే అప్పట్లో జగన్ మోహన్ రెడ్డిని కాంగ్రెస్ నేతలు బయటకు తీసుకు వచ్చార‌ని ఆరోపించారు. ఆ రోజు రాష్ట్ర విభజనపై బీజేపీ నేతలు కాంగ్రెస్ నేతలను నిలదీశార‌ని, ఇప్పడు సమస్యను పరిష్కరించమని వారిని కోరుతున్నామ‌న్నారు. 
 
బీజేపీ నేతలతో రాజీ పడ్డామ‌ని ఆరోపణలు చేస్తున్నార‌ని, రాజీ పడేది లేద‌ని, నిత్యం పోరాడుతూనే ఉంటానన్నారు. అన్ని రాష్ట్రాలతో సమంగా వచ్చే వరకు ఆర్థిక సాయం కేంద్రం చేయాల‌ని, ఒక అవినీతి పేపర్ అనవసర విషయాలు రాస్తోంద‌ని మండిపడ్డారు.