Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

జెసి సహనం కోల్పోవద్దు - జాగ్రత్త.. బాబు క్లాస్

మంగళవారం, 11 జులై 2017 (16:00 IST)

Widgets Magazine
babu-JC

దేనికైనా ఒక సందర్భం ఉంటుంది. అన్నిటికీ కోప్పడితే ఎలా... మనం అలా ప్రవర్తించకూడదు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాం. సహనం అస్సలు కోల్పోకూడదు. జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ ఎవరో చెప్పింది కాదు. స్వయంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జెసి.దివాకర్ రెడ్డికి ఇచ్చిన ప్రత్యేక క్లాస్. అమరావతిలో ప్రత్యేకంగా జెసితో మాట్లాడిన బాబు 15 నిమిషాల పాటు క్లాస్ పీకారట. బాబు అలా మాట్లాడతారని జెసి అస్సలు ఊహించలేదట. 
 
ట్రావెల్ బ్యాన్ వివాదాన్ని పరిష్కరించుకోవాలని జెసికి బాబుకు సూచించారు. విశాఖ ఎయిర్‌పోర్టులో బోర్డింగ్ పాస్ విషయంలో ఎయిర్‌పోర్టు సిబ్బందిపై ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసి ప్రింటర్‌ను లాగిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనపై ప్రస్తుతం ట్రావెల్ బ్యాన్ ఉంది. రెండు రోజుల క్రితం హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లగా ఎయిర్‌పోర్టు సిబ్బంది అడ్డుకోవడంతో ఆయన వెనుదిరిగారు.
 
ఆ తరువాత మీడియాలో కూడా పెద్ద ఎత్తున వార్తలు కూడా వచ్చాయి. దీనిపై పార్టీ పరువు కూడా పోతోందని భావించిన ముఖ్యమంత్రి జెసికి క్లాస్ పీకారట. ఇప్పటికైనా కేంద్ర విమానయాన శాఖామంత్రి అశోక్ గజపతిరాజుతో కలిసి కూర్చుని మాట్లాడుకోమని, ఇలాంటిది మరోసారి జరక్కూడదని చెప్పారట బాబు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

పక్కింటి బాత్రూమ్‌లో కెమెరా పెట్టి.. 18ఏళ్ల కుర్రాడు ఏం చేశాడంటే?

తమిళనాడు కాంచీపురం జిల్లాలో 18 ఏళ్ల కుర్రాడు పక్కింటి బాత్రూమ్‌లో కెమెరా పెట్టాడు. ఆ ...

news

అమర్‌నాథ్ టెర్రర్ ఎటాక్... మోదీజీకి అలాంటి ఫ్యాన్స్ వద్దు... పరేష్ రావల్

అమర్‌నాథ్ ఉగ్రదాడిపై సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. బాలీవుడ్ నటుడు పరేష్ రావల్ ...

news

ఎన్నికల వ్యూహాలు రచించడంలో నాకంటే మొనగాళ్లు ఎవరు.. ఎంపీలతో చంద్రబాబు

ఎన్నికల వ్యూహాలు రచించడంలో తనకంటే మొనగాళ్లు ఎవరున్నారనీ తమ పార్టీ ఎంపీలతో టీడీపీ అధినేత, ...

news

ఆ సైట్ ఓపెన్ చేస్తే చంద్రబాబు కనిపిస్తాడు.. ఏ సైట్...!

విశ్వవిద్యాలయాలను కూడా పార్టీ కార్యాలయాల్లాగా మారుతున్నాయా అనే విమర్శలు వస్తున్నాయి. ...

Widgets Magazine