గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: శుక్రవారం, 7 జులై 2017 (15:06 IST)

విత్తనాలు, ఎరువులు, రుణాలిస్తున్నాం... ‘‘పొలం పిలుస్తోంది’’... ముఖ్యమంత్రి చంద్రబాబు

వ్యవసాయాన్ని లాభసాటి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సాయిల్ హెల్త్ కార్డులు 97% పంపిణీ చేశామని, విత్తనాలు, ఎరువులు, పంటరుణాలు అందిస్తున్నామని, సూక్ష్మపోషకాలు ఉచితంగా అందజేస్తున్న విషయం గుర్తుచేశారు. ఇన్‌

వ్యవసాయాన్ని లాభసాటి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సాయిల్ హెల్త్ కార్డులు 97% పంపిణీ చేశామని, విత్తనాలు, ఎరువులు, పంటరుణాలు అందిస్తున్నామని, సూక్ష్మపోషకాలు ఉచితంగా అందజేస్తున్న విషయం గుర్తుచేశారు. ఇన్‌పుట్ సబ్సిడి రూ.1,030 కోట్లు, వాతావరణ బీమా పరిహారం రూ.420 కోట్లు పంపిణీ చేశామన్నారు. ఈ మొత్తాన్ని ఖరీఫ్ సీజన్లో పంట పెట్టుబడులకు రైతులు ఉపయోగించుకోవాలన్నారు.  వ్యవసాయానికి కావాల్సిన వనరులన్నీ రైతులకు ముందే ఇస్తున్నాం కాబట్టి ఈ ఏడాది అన్ని పంటల్లో మంచి దిగుబడులు సాధించాలని ఆకాంక్షించారు. వ్యవసాయ పంటల్లో, ఉద్యానతోటల్లో ఉత్పాదకత గరిష్ట స్థాయికి చేరుకోవాలన్నారు. 
 
వ్యవసాయం, అనుబంధ రంగాల్లో 25% వృద్ధి సాధించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. నీళ్లు వచ్చాయి, కరెంట్ ఉంది, ఇన్‌పుట్స్ ఇస్తున్నాం, పంట బీమా, పెట్టుబడి రాయితీ ఇచ్చాం, ఇక దిగుబడులు పెరగడమే తరువాయిగా పేర్కొన్నారు. కౌలు రైతులకు పంట రుణాలు సత్వరమే అందించాలన్నారు. ఏ బ్యాంకులో ఏ బ్రాంచి నుంచి ఎంత మొత్తంలో పంట రుణాలు కౌలు రైతులకు అందించారో నివేదిక ఈ నెల 26 నాటికల్లా అందజేయాలని ఇటీవల బ్యాంకర్లతో భేటిలో పేర్కొన్న విషయం ప్రస్తావించారు.
 
పండిన పంటలకు మార్కెట్ వసతులు పూర్తిస్థాయిలో కల్పిస్తున్నామని తెలిపారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో వ్యవసాయాన్ని లాభసాటి చేయడమే లక్ష్యంగా అధికార యంత్రాంగం కృషి చేయాలన్నారు. ప్రతి ఇంజినీరింగ్ కాలేజిలో రిసోర్స్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాలని సూచించారు. గతంలో జియో ట్యాగింగ్‌కు రూ.600 అయ్యేదంటూ ప్రస్తుతం రూ.10కే చేస్తున్న  విషయం ప్రస్తావించారు. ఆధార్ తో అనుసంధానం వల్ల అక్రమాలకు కళ్లెం పడిందన్నారు. ఈ-క్రాపింగ్ 14% మాత్రమే అయ్యిందంటూ వెంటనే స్పందించి 100% పూర్తిచేయాలని ఆదేశించారు. 
 
శ్రీకాకుళం, ప్రకాశం, విజయనగరం జిల్లాలలో ఈ-క్రాపింగ్ మరింత మెరుగుపడాలన్నారు. మైక్రో న్యూట్రియంట్ల పంపిణీ తూర్పుగోదావరి, విజయనగరం, అనంతపురం, కడప జిల్లాలలో వేగవంతం కావాలన్నారు. విశాఖపట్నం, నెల్లూరు జిల్లాలలో గ్రీన్ మెన్యూర్ల పంపిణీ మందకొడిగా జరగడంపై అసంతృప్తి వ్యక్తంచేశారు. పండ్ల తోటలకు అవసరమైతే డ్రోన్ల ద్వారా క్రిమిసంహారక మందులు జల్లించే వీలుకూడా ఉందన్నారు. మాంసం, గుడ్లు, చేపల ఉత్పత్తిలో నిర్ణయించిన లక్ష్యాలను చేరుకోవాలని ఆదేశించారు, క్వార్టర్ల వారీగా పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలన్నారు. ‘‘పొలం పిలుస్తోంది’’ కార్యక్రమం ద్వారా రైతుల్లో అవగాహన పెంచాలని కోరారు.
 
సకాలంలో స్పందన, పర్యవేక్షణ, అవగాహన, అమలు ద్వారా వ్యవసాయంలో అద్భుత ఫలితాలు సాధించగలమని ముఖ్యమంత్రి అన్నారు. రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా వ్యవసాయంలో మంచి ఫలితాలు సాధించగలమని చెప్పారు. యాంత్రీకరణకు భారీఎత్తున నిధులు కేటాయించామన్నారు. డ్రైస్పెల్స్ ఎదురైనప్పుడు రెయిన్ గన్ టెక్నాలజితో అధిగమించేందుకు ఇప్పటికే ట్రయల్ రన్స్ నిర్వహించడం అభినందనీయం అన్నారు. కరవు అధిగమించడం, రాబడి పెంచడం, పేదరిక నిర్మూలనపై అందరూ దృష్టి సారించాలన్నారు. ప్రతి కుటుంబానికి నెలకు రూ.10వేలు రాబడి ఉండాలన్నదే ధ్యేయంగా యంత్రాంగం పనిచేయాలన్నారు.
 
చెరువులు, పంటకుంటల్లో చేపల పెంపకాన్ని ప్రోత్సహించాలి
చెరువుల్లో, పంటకుంటల్లో చేపల పెంపకాన్ని ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. పశ్చిమ బెంగాల్ తరహాలో పంటకుంటల్లో  చేపల పెంపకం ద్వారా రైతులకు రాబడి పెంచాలన్నారు.  అవపసరమైతే పంటకుంటల లోతు పెంచడంపై దృష్టి సారించాలన్నారు. సకాలంలో వర్షాలు పడటంతో పశుగ్రాసం కొరతలేదు కాబట్టి పాల దిగుబడి పెరగాలన్నారు. ఉద్యానతోటలు సాగుచేసే భూములు అన్నింటిలో డ్రిప్ ఇరిగేషన్‌ను ప్రోత్సహించాలని ఆదేశించారు. మనరాష్ట్రం దేశానికే హార్టీకల్చర్ హబ్ కావాలన్నదే ప్రభుత్వ సంకల్పంగా తెలిపారు.
 
ఈ టెలికాన్ఫరెన్స్‌లో మంత్రి సుజయ కృష్ణ వెంకట రంగారావు, వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ హరి జవహర్ లాల్, అనుబంధ రంగాల అధికారులు మన్మోహన్ సింగ్, రాంశంకర్ నాయక్, సీఎంవో కార్యదర్శి రాజమౌళి, సెర్ప్ సీఈవో కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.