Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ప్రత్యేక హోదా వద్దు కానీ రైల్వే జోన్ ఇవ్వాలి, రెవెన్యూ లోటు భర్తీ చేయండి: చంద్రబాబు

సోమవారం, 6 ఫిబ్రవరి 2017 (17:23 IST)

Widgets Magazine
chandrababu

విభజన హామీ మేరకు ప్రత్యేక హోదాను ఇవ్వక పోయినా ఫర్లేదు కాదనీ.. రైల్వే జోన్ ఇచ్చి, రెవెన్యూ లోటును భర్తీ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. గుంటూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ... రాష్ట్ర ప్ర‌యోజ‌నాల దృష్ట్యా ప్ర‌త్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కోసం ప్ర‌య‌త్నాలు జ‌రిపామ‌ని, ఈ అంశంపై కేంద్ర ప్ర‌భుత్వం సానుకూలంగా స్పందించింద‌న్నారు. 
 
అలాగే రైల్వే జోన్ ఇవ్వాలని, రెవెన్యూ లోటు భర్తీ చేయాలని తాము కేంద్రప్ర‌భుత్వాన్ని అడుగుతున్నామ‌ని ఆయ‌న అన్నారు. బడ్జెట్‌పై తాము కసరత్తు మొద‌లుపెట్టిన‌ట్లు ఆయ‌న తెలిపారు. అన్ని శాఖలతో ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడారని అన్నారు. విభ‌జ‌న తర్వాత ఏపీలో ఎన్ని సమస్యలు ఉన్నా రెండంకెల వృద్ధిరేటు సాధించామని ఆయ‌న పేర్కొన్నారు.
 
రాష్ట్రంలోని విద్యుత్ రంగంలో తాము తీసుకున్న చర్యల ఫ‌లితంగా మిగులు స్థాయికి చేరుకోగలిగామని చంద్ర‌బాబు నాయుడు తెలిపారు. తాము తీసుకున్న నిర్ణయాలతో సానుకూల వాతావరణం ఏర్పడిందని ఆయ‌న చెప్పారు. ఒక‌వైపు రాష్ట్రంలో కరవు పరిస్థితులు ఉన్నప్పటికీ సుస్థిరమైన వృద్ధి రేటు సాధించే అవకాశం ఉందని ఆయ‌న అన్నారు. జీఎస్టీ స‌వ‌ర‌ణ బిల్లు వల్ల రాబోయే రోజుల్లో రెవెన్యూ పెరుగుతుందని ఆయ‌న తెలిపారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

#sasikala 'The told story', కరుణానిధి ముందు పెళ్లి, జయలలితను వీడియో షూటింగ్...

అవును. ఇప్పుడు ఈ పేరు తమిళనాడులోనే కాదు దేశంలోనూ మారుమోగుతోంది. ఎవరూ ఊహించని విధంగా ...

news

జయలలితను విషమ పరిస్థితుల్లో హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు.. మరణం వెనుక కుట్రలేదు : రిచర్డ్ బాలే

తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న జయలలితను అత్యంత విషమ పరిస్థితుల్లో ఆస్పత్రిలో అడ్మిట్ ...

news

పన్నీర్ రాజీనామాకు ఓకే.. శశికళ పట్టాభిషేకానికి ముహుర్తమెపుడు.. గవర్నర్ చేతిలో కీ!

తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు క్షణానికో మలుపు తిరుగుతున్నాయి. తన వ్యక్తిగత కారణాల రీత్యా ...

news

శశికళ సీయమ్మా...? మేం పారిపోతాం... కామెంట్స్ వెల్లువ

అనుకున్నదే జరుగుతోంది. అన్నాడీఎంకే పతనం ఇంకా ఎంతో దూరంలో లేనట్లు తెలుస్తోంది. తమిళనాడులో ...

Widgets Magazine