Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అరుణ్ జైట్లీని అటాడుకోండి : ఎంపీలతో చంద్రబాబు

గురువారం, 8 ఫిబ్రవరి 2018 (10:41 IST)

Widgets Magazine
chandrababu

విభజన వల్ల నష్టపోయిన ఏపీకి తగినన్ని నిధులు కేటాయించకుండా మోసం చేసిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రసంగాన్ని అడ్డుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సొంత పార్టీ ఎంపీలకు పిలుపునిచ్చారు. వార్షిక బడ్జెట్‌పై జైట్లీ సమాధానం ఇచ్చే సమయంలో ఆయన ప్రసంగానికి అడ్డు తగలాలని ఆయన ఆదేశించారు. 
 
కాగా, వార్షిక బడ్జెట్‌లో నిధుల కేటాయింపులో మొండిచేయి చూపడంతో అధికార టీడీపీ ఎంపీలు గుర్రుగా ఉన్న విషయం తెల్సిందే. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి టీడీపీ ఎంపీలు దూకుడుగా వ్యవహరిస్తూ, ఉభయసభల్లో నిరసన కార్యాక్రమాలు చేస్తున్నారు. ఇవి గత నాలుగు రోజులుగా కొనసాగుతున్నాయి. 
 
తమ అధినేత చంద్రబాబు సూచనల మేరకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం సమయంలో కొంతమేరకు శాంతించిన టీడీపీ ఎంపీలు... ప్రధాని మోడీ నుంచి ఏపీ ప్రయోజనాలకు సంబంధించి ఎలాంటి హామీలు రాకపోవడంతో ఎంపీలు మళ్లీ ఆందోళనలకు దిగారు. ఈ నేపథ్యంలో, సస్సెన్షన్‌కు కూడా గురయ్యారు. తాజాగా పార్లమెంటులో ఈరోజు వ్యవహరించాల్సిన తీరుపై టీడీపీ ఎంపీలకు చంద్రబాబు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. 
 
ఉభయసభల్లో ఆందోళనలను తీవ్రతరం చేయాలని ఆదేశించారు. ఈ మేరకు గురువారం ఎంపీలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బడ్జెట్‌పై అరుణ్ జైట్లీ సమాధానం చెప్పేటప్పుడు ఆందోళనలు, నిరసనలు చేపట్టాలని, నినాదాలు చేయాలని సూచించారు. ఏ క్షణంలోకూడా వెనక్కి తగ్గవద్దని, సభ నుంచి గెంటేసినా ఫర్వాలేదనీ ఆయన తేల్చి చెప్పారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

అయ్యా... లే అయ్యా... నీ కోసం ఎంత మంది వచ్చారో చూడయ్యా...

డెంగీ జ్వరం కారణంగా చనిపోయిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, శాసనమండలి సభ్యుడు గాలి ...

news

రేణుకా చౌదరిని మోదీ ఇలా అనేశారే? రామాయణం తర్వాత ఆ నవ్వును..?

''ట్రిపుల్ తలాక్'' బిల్లు ఓ ఒక్క కమ్యూనిటినో ఉద్దేశించినది కాదని.. ఇదే నేరం కింద హిందూ ...

news

మిస్టర్ ప్రైమ్‌మినిస్టర్.. తెలుగు ప్రజలు ఫూల్స్ కాదు : టీడీపీ

'మిస్టర్‌ ప్రైమ్‌ మినిస్టర్‌, మిస్టర్‌ ఫైనాన్స్‌ మినిస్టర్‌! సభా వేదిక నుంచి డిమాండ్‌ ...

news

మీరిచ్చిన నిధుల కంటే.. 'బాహుబలి' కలెక్షన్లే అధికం : గల్లా జయదేవ్

పార్లమెంట్ సాక్షిగా బీజేపీ నేతలను టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కడిగిపారేశారు. అడ్డగోలు విభజన ...

Widgets Magazine