Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రోడ్లపై గుంతలు లేకుండా చూడండి... రహదారులు విస్తరించండి...

మంగళవారం, 4 జులై 2017 (17:24 IST)

Widgets Magazine
Review meeting

అమరావతి : రాష్ట్రంలోని వివిధ జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారుల విస్తరణ పనులను వేగవంతంగా చేపట్టి నిర్దేశిత సమయం ప్రకారం పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జాతీయ రహదారుల అధారిటీ ఆఫ్ ఇండియా మరియు ఆర్అండ్ బి శాఖల అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ ఆదేశించారు. మంగళవారం వెలగపూడి సచివాలయంలో ఆర్అండ్ బి పెండింగ్ ప్రాజెక్టులు, భూసేకరణ, రహదారుల నిర్వహణ తదితర అంశాలపై జాతీయ రహదారులు అధారిటీ అధికారులు, ఆర్అండ్ బి తదితర శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు.
 
ఈ సందర్భంగా జాతీయ రహదారుల అధారిటీ ఆఫ్ ఇండియా అధికారులు వివిధ జిల్లాల్లో చేపట్టిన జాతీయ రహదారుల విస్తరణ పనుల ప్రగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. రాష్ట్రంలో 16వ నంబరు, 216 మరియు 65వ జాతీయ రహదారుల విస్తరణకు సంబంధించిన ప్రగతి, భూసేకరణ ఇతర అంశాలకు చెందిన సమస్యలను సిఎస్ దృష్టికి తెచ్చారు. దానిపై సిఎస్ స్పందించి వివిధ రహదారుల విస్తరణకు సంబంధించి భూసేకరణ అంశాలకు సంబందించి సమస్యలుంటే ఎప్పటికప్పుడు సిసిఎల్ఏ, సంబందిత కలెక్టర్లతో తరచు మాట్లాడి సకాలంలో పరిష్కరించేదుందుకు కృషి చేయాలని అన్నారు. ఇందుకు సంబంధించి తనవైపు నుండి కలక్టర్లు అందరికీ లేఖలు వ్రాయాలని అధికారులను ఆదేశించారు. అలాగే అటవీ అనుమతుల సమస్యలపై అటవీశాఖ ఉన్నతాధికారులుతో ఎప్పటికప్పుడు మాట్లాడాలని అధికారులకు ఆయన సూచించారు.ఎట్టిపరిస్థితుల్లోను రాష్ట్రంలో మంజూరు చేసిన వివిధ జాతీయ,రాష్ట్ర రహదారుల విస్తరణ పనులన్నిటినీ వేగవంతంగా పూర్తి చేసేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని సిఎస్ ఆదేశించారు.
 
ఆస్ట్రేలియా తరహాలో రహదారుల మెరుగైన నిర్వహణ
ఆస్ట్రేలియా తరహాలో రాష్ట్రంలోని వివిధ రహదారులను మెరుగైన రీతిలో నిర్వహించేందుకు వీలుగా ప్రత్యేక కన్సల్టెన్సీని ఏర్పాటు చేసి ఉత్తమ విధానాన్ని తీసుకువచ్చి అమలు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సిఎస్ దినేష్ కుమార్ ఆర్అండ్ బి అధికారులకు సూచించారు. రహదారులు వేసిన కొద్దినెలలకే గుంతలుపడి రవాణాకు ఇబ్బింది కలగడం వంటి సమస్యలు లేకుండా మెరుగైన రీతిలో రహదాల నిర్వహణ ఉండేలా చూడాల్సిన అవసరం ఉందని చెప్పారు.
 
సమావేశంలో రోడ్లు భవనాలశాఖ ముఖ్యకార్యదర్శి మరియు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సుమిత్రా దావ్రా మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం 6వేల 672కి.మీల పొడవున జాతీయ రహదారులు, 15వేల 406కి.మీల పొడవైన రాష్ట్ర రహదారులు, 31వేల 596 కి.మీల పొడవునల జిల్లా రహదారులు ఉన్నాయని తెలిపారు. ఆయా రహదారులపై ఏర్పడిన గోతులు ఇతర మరమ్మత్తు పనులను యుద్దప్రాతిపదిక చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. ఇందుకుగాను ఎపిఆర్ఎంఎస్(ఆంధ్ర్రప్రదేశ్ రోడ్డు మెయిన్టెన్స్ సిస్టమ్)కింద అన్ని జిల్లాల్లో కాంట్రాక్టర్లు,ఇంజనీర్లకు తగిన శిక్షణా కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. జిల్లా స్థాయిలో ఆర్అండ్ బిఎస్ఇ నోడలు అధికారిగా ఆర్ఎంఎస్‌కు సంబంధించి ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసి రహదారుల నిర్వహణను మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఆమె వివరించారు.
 
ఇంకా ఈసమావేశంలో వివిధ జాతీయ, రాష్ట్ర రహదారుల విస్తరణ అంశాలతో పాటు 5 జిల్లాలను కలుపుతూ సుమారు 557 కి.మీల పొడవున 4 మరియు 6 వరుసలతో నిర్మించ ప్రతిపాదించిన అనంతపూర్-అమరావతి ఎక్స్‌ప్రెస్‌వే, అమరావతి రాజధాని చుట్టూ సుమారు 186 కి.మీల పొడవున నిర్మించ ప్రతిపాదించిన అవుటర్ రింగ్ రోడ్డు అంశాలపై కూడా సమావేశంలో ఆయా అధికారులతో సిఎస్ చర్చించారు. ఈ సమావేశంలో అటవీ పర్యావరణశాఖ ముఖ్యకార్యదర్శి అనంత రామలు, ఆర్ధికశాఖ కార్యదర్శి యం.రవిచంద్ర, ఇంకా రెవెన్యూ,ఆర్అండ్ బి, జాతీయ రహదారుల ఆధారిటీ ఆఫ్ ఇండియా తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

యూపీలో కునుకుతీశారు.. బీహార్‌లో క్యాండీక్రష్ ఆడారు.. పోలీసులపై యాక్షన్..

మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టడంపై బీహార్ పోలీసులు ఏప్రిల్ 28న ప్రత్యేక సదస్సును ...

news

బ‌స్సులో మహిళకు ముద్దుపెట్టాడు.. ఆపై పరారైనాడు.. రేప్ చేశాడని బీజేపీ నేతపై ఫిర్యాదు?

వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే కాకుండా.. నేరాలకు పాల్పడే బీజేపీ నేతల సంఖ్య కూడా ...

news

రాజకీయాల్లో పవన్ చరిత్ర సృష్టిస్తాడు.. ఏపీ పాలిటిక్స్‌‌కు బెస్ట్ ఆప్షన్ అతడే: నాగబాబు

జబర్దస్త్ జడ్జి, మెగా సోదరుడు, నటుడు నాగబాబు తన సోదరుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ...

news

నారాయణ కళాశాలలో మరో విద్యార్థిని యవ్వన ఆత్మహత్య(వీడియో)

కారణాలు ఏమయినప్పటికీ నారాయణ కళాశాలలో చదివే విద్యార్థుల్లో కొంతమంది ఆత్మహత్యలు చేసుకోవడం ...

Widgets Magazine