బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Eswar
Last Updated : మంగళవారం, 22 జులై 2014 (19:52 IST)

రుణమాఫీ నిధుల కోసం ఎర్రచందనం వేలం వేస్తారా...?

ఇప్పటికే ప్రతి రైతు కుటుంబానికీ లక్షా 50 వేల రూపాయల రుణమాఫీ ప్రకటించిన చంద్రబాబు నిధుల సమీకరణ పనిలో పడ్డారు. రుణమాఫీ అమలుచేయడం కోసం నిధుల సమీకరణకు సుజనా చౌదరి నేతృత్వంలో ఓ కమిటీ వేస్తున్నారంటూ ఓ పక్క ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టి నిధుల సమీకరించాలని కమిటీ తొలుత భావించినా, ప్రస్తుతానికి  ఆ  పనిచేయకుండా ఎర్రచందనాన్ని వేలం వేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నట్టు సమాచారం.
 
ప్రభుత్వం అందుకు సంబంధించిన కసరత్తు కూడా చేస్తోంది. ఎర్రచందనం నిల్వలు ఎక్కడెక్కడున్నాయి. వాటి విక్రయం ఎలా చేయాలి. ఎప్పుడు టెండర్లు పిలవాలి అనే విషయాన్ని పరిశీలించడం కోసం ముగ్గురు అధికారులను కూడా ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిందంటున్నారు. ఇప్పటికే వారు కడప, తిరుపతి, రాజంపేట ప్రాంతాల్లో నిలువ ఉంచిన ఎర్రచందనాన్ని పరిశీలించారట. 10 రోజుల్లో టెండర్లు పిలిచే అవకాశం ఉంటుందని సమాచారం.