శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By JSK
Last Modified: శనివారం, 23 జులై 2016 (21:27 IST)

తమిళనాడులో ఏపీ సదావర్తి భూములు... అడ్డదిడ్డంగా షరతులు...

సదావర్తి సత్రం భూముల విషయంలో ఏపీ ప్రభుత్వం తీరు తమాషాగానే ఉంది. వెయ్యి కోట్ల రూపాయల విలువైన భూమిని 22 కోట్లకే తెలుగుదేశం పార్టీ నేతలకు కట్టబెట్టారని ఆరోపణలు వచ్చిన నేపద్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అంతకు ఐదు కోట్లు అదనంగా ఇస్తే ఆ భూములు వారికి ఇస్తామని

సదావర్తి సత్రం భూముల విషయంలో ఏపీ ప్రభుత్వం తీరు తమాషాగానే ఉంది. వెయ్యి కోట్ల రూపాయల విలువైన భూమిని 22 కోట్లకే తెలుగుదేశం పార్టీ నేతలకు కట్టబెట్టారని ఆరోపణలు వచ్చిన నేపద్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అంతకు ఐదు కోట్లు అదనంగా ఇస్తే ఆ భూములు వారికి ఇస్తామని సవాల్ చేశారు. దానికి స్పందించిన పిఎల్ఆర్ అనే సంస్థ ఐదు కోట్లు అదనంగా ఇవ్వడానికి సిద్ధపడింది. మరో రెండు సంస్థలు కూడా ఇలాగే ముందుకు వచ్చాయని వార్తలు వచ్చాయి. కాగా పిఎల్ఆర్ సంస్థకు ప్రభుత్వం సమాధానం ఇస్తూ రాసిన వివరాలు ఆశ్చర్యం కలిగించాయి. 
 
ఈ లేఖ రాసిన వారం రోజుల లోపుల రూ. 28 కోట్లు ఇవ్వాలని, ఆ తర్వాత తాము వేలం వేస్తామని, అంతకన్నా ఎక్కువ ఎవరైనా ఇస్తే వారికి భూమిని ఇస్తామని తెలిపారు. అంతేకాదు అసలు ఆ భూములను రిజిస్టర్ చేయరట. అమ్మకం సర్టిఫికెట్ ఇస్తారట. తమిళనాడు ప్రభుత్వం నుంచి పట్టా తెచ్చుకోవాలని, ఆక్రమణలు మీరే తొలగించుకోవాలని కండిషన్లు పెట్టారట. 
 
నిజంగానే ప్రభుత్వం ఇంత డొల్లతనంగా ఉందేమిటన్న విమర్శలు వస్తున్నాయి. ఎక్కడైనా డబ్బు కట్టేవాడు రిజిస్ట్రేషన్ లేకుండా సిద్ధపడతాడా?మరి కాపు కార్పొరేషన్ చైర్మన్ రామానుజయ కుటుంబానికి భూమి వేలం విషయంలో ఎందుకు అంత ఉదారంగా ఉన్నారు? ఇప్పుడు ఎందుకు కఠిన షరతులు పెడుతున్నారంటే ఆ మతలబు ఏమిటో అర్ధం చేసుకోలేరా అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.