రోజా ఓ తింగరబుచ్చి... డ్యాన్సులు వేయడం మినహా ఏమీ తెలియదు!

ఆదివారం, 5 నవంబరు 2017 (08:30 IST)

ayyannapatrudu

వైసీపీ ఫైర్‌బ్రాండ్, నగరి ఎమ్మెల్యే ఆర్కే.రోజాపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అంతెత్తున మండిపడ్డారు. ఆమెనో తింగరబుచ్చిగా అభివర్ణించారు. ఆమెకు జబర్దస్త్‌లో డ్యాన్సులు వేయడం మినహా ఏమీ తెలియదన్నారు. అందువల్ల ఆమె మాటలను ఎవరూ విశ్వసించే పరిస్థితి లేదన్నారు.
 
'ఇంటింటికీ తెలుగుదేశం' కార్యక్రమంలో భాగంగా శనివారం విశాఖపట్టణం జిల్లా చీడికాడలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ, వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రను అడ్డుకునేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారంటూ రోజా చేసిన ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. 
 
జగన్‌కు, చంద్రబాబుకు మధ్య తేడా 'నక్కకు నాగలోకానికి' ఉన్నంతగా ఉందన్నారు. అందువల్ల జగన్‌ పాదయాత్రకు బెదిరిపోయే నేత ముఖ్యమంత్రి కాదని అయ్యన్నపాత్రుడు జోస్యం చెప్పారు. పనిలోపనిగా రోజాపై ఆయన ఘాటైన విమర్శలు గుప్పించారు. 'జబర్దస్త్‌'లో డాన్సులు చేసే రోజా ఓ తింగరబుచ్చి. ఆమెకి ఏమీ తెలియదన్నారు. జగన్ పాదయాత్రకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్న విషయాన్ని ఆమె తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు. దీనిపై మరింత చదవండి :  
Mla Roja Chandrababu Naidu Ys Jagan Padayatra Ap Minister Ayyanna Patrudu

Loading comments ...

తెలుగు వార్తలు

news

నటుడు ఉపేంద్రకు షాకిచ్చిన గాలి జనార్థన రెడ్డి...

దేశంలో గాలిజనార్థన్ రెడ్డి ఏది చేసినా సంచలనమే. ఆయన పేరు ఓ సంచలనమే. ఆయన పేరుతోనే వార్తలు ...

news

తిరుమలలో జగన్ కంటే రోజా స్పెషల్ అట్రాక్షన్ అయ్యారా?

సినీ తారలు ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చేస్తుండటంతో రాజకీయాల్లో ఉన్న నేతలు వారిలా రెడీ ...

news

ఎపి ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నమాట వాస్తవమే.. చంద్రబాబు(వీడియో)

తిరుపతి అభివృద్థి అంతా తెలుగుదేశంపార్టీ ఘనతేనన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు. ...

news

జగన్ స్వరూపానందను ఎందుకు కలిశాడో తెలిస్తే షాక్...

వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఈసారి అధికారంలోకి వచ్చేందుకు జగన్ కాస్త వెనక్కి తగ్గి రకరకాల ...