రాజకీయ చరిత్రలో ఏ మంత్రి చేయని పని చేస్తున్న కామినేని శ్రీనివాస్.. ఏంటది?

గురువారం, 8 మార్చి 2018 (20:47 IST)

kamineni srinivas

గత కొన్నిరోజులుగా టిడిపి, బిజెపి నేతల మధ్య తీవ్రస్థాయిలో ఆరోపణలు, ప్రత్యారోపణలు నడుస్తున్న విషయం తెలిసిందే. టిడిపి నేతలకన్నా బిజెపి నేతలే మరింతగా రెచ్చిపోయి తెలుగు తమ్ముళ్ళపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బిజెపి నేతల్లో సోమువీర్రాజు, విష్ణుకుమార్ రాజులు చేసిన వ్యాఖ్యలను పెద్దగా చెప్పనవసరం లేదు. ఓపిక నశించిపోయిన కొంతమంది టిడిపి నేతలు బిజెపికి చెందిన ఇద్దరు మంత్రులపైనా విమర్శలు చేశారు.
 
ఆ విమర్శలతో కామినేని శ్రీనివాస్ తీవ్రంగా నొచ్చుకున్నారు. కామినేని శ్రీనివాస్ స్వతహాగా చాలా సున్నిత స్వభావుడు. వైద్య, ఆరోగ్య శాఖామంత్రిగా ఉన్నప్పుడు శ్రీనివాస్ అక్రమంగా అవినీతి డబ్బులను సంపాదించారని టిడిపి నేతలు విమర్శించారు. దీంతో కామినేని శ్రీనివాస్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రాజీనామా లేఖను సమర్పించిన తరువాత అసెంబ్లీలో ఉద్వేగంగా మాట్లాడారు. 
 
తను మంత్రిగా ఉన్నప్పుడు ఒక్కరూపాయి కూడా ఎవరి నుంచి తీసుకోలేదని చెప్పారు. నేను మంత్రిగా అవినీతికి పాల్పడలేదని రేపు చిత్తూరు జిల్లాలోని ప్రముఖ క్షేత్రం అయిన కాణిపాక వరిసిద్ధి వినాయక ఆలయంలో ప్రమాణం చేయనున్నట్లు ప్రకటించారు. రేపు బిజెపి నేతలతో కలిసి ఆయన చిత్తూరు జిల్లాకు వచ్చి ప్రమాణం చేయనున్నారు. ఇప్పటివరకు ఏ మంత్రి చేయని విధంగా కామినేని శ్రీనివాస్ కాణిపాకం ఆలయంలో ప్రమాణం చేస్తాననడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తోంది.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఆ రోజు ఆ పని చేశాడని, మహిళ దినోత్సవం నాడు చెప్పుతో కొట్టిన టీచర్

తమపై జరిగిన అన్యాయాన్ని ఎదిరించడానికి, తగిన బుద్ధి చెప్పడానికి చాలామంది అదను కోసం ...

news

నరేంద్ర మోడీ అనే నేను... నెటిజన్స్ వ్యంగ్యాస్త్రాలు

టాలీవుడ్ దర్శకుడు కొరటాల శివ తాజా చిత్రం "భరత్ అనే నేను". ఈ చిత్రంలో మహేష్ బాబు హీరోగా ...

news

ఆ రోజు రెండో భార్య శవాన్ని భుజంపై మోశాడు... ఇప్పుడు మూడో భార్యతో...

గత ఏడాది ఆగస్టు నెలలో టీబీతో చనిపోయిన తన భార్యను ఇంటికి తీసుకువెళ్లేందుకు డబ్బులు లేక ...

news

పోరాటం స్పెల్లింగ్ జగన్‌కు తెలియదు... మంత్రి సోమిరెడ్డి ఎద్దేవా

అమరావతి: ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డికి పోరాటం స్పెల్లింగ్ కూడా తెలియదని, అటువంటి ఆయన ...