Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సీల్డు కవర్.. సీఎం చాంబర్.. సేఫ్ లాకర్... మంత్రిగారి భవితవ్యం భద్రం.. ఎవరాయన?

శుక్రవారం, 3 ఫిబ్రవరి 2017 (14:48 IST)

Widgets Magazine
ravela kishore babu

ఓ సీల్డు కవర్. అందులే ఆ మంత్రివర్యుని భవితవ్యం. ముఖ్యమంత్రి చంద్రబాబు నిశితంగా పరిశీలించి తన చాంబర్‌లోని సేఫ్ లాకర్‌లో భద్రపరిచారు. ఆ లాకర్ తాళం చెవిని తనవద్దే ఉంచుకున్నారు. అంటే ఆ మంత్రిగారి భవిష్యత్ సేఫ్ లాకర్‌లో ప్రస్తుతానికి భద్రంగా ఉంది. ఇంతకీ ఆ మంత్రి ఎవరన్నదే కదా మీ సందేహం.. ఇంకెవరు... రావుల కిషోర్ బాబు. చంద్రబాబు మంత్రివర్గంలో సాంఘిక సంక్షేమ శాఖామంత్రిగా కొనసాగుతున్నారు. 
 
ఇటీవల గుంటూరులోని తన ఇంటి నుంచి భద్రతా సిబ్బందిని కూడా వదిలేసి ఎటో వెళ్ళిపోయారు. సుమారు మూడున్నర గంటలపాటు వారికి ముచ్చెమటలు పట్టించారు. సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో తన నివాసం నుంచి వెళ్ళిపోయిన రావెల రాత్రి పదిన్నర గంటలకు తిరిగి వచ్చారు. అంతసేపూ ఆయన ఎక్కడికి వెళ్ళారో తెలియక అంతా హైరానా పడ్డారు. ఈ విషయం ముఖ్యమంత్రి దృష్టికెళ్లింది. 
 
తన స్నేహితుడు రాంబాబు ఇంటికి భోజనానికి వెళ్లానని ఆయన చెప్పినా, సెక్యూరిటీ లేకుండా అంత హడావుడిగా వెళ్ళాల్సిన అవసరమేమిటన్నది సస్పెన్స్‌గా మారింది. ఈ వైనం తెలుసుకుని ఆగ్రహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. మంత్రి రావెల ఆ రోజు ఎక్కడికి వెళ్ళారో, ఏం చేశారో తెలుసుకోవలసిందిగా పోలీసులను, ఇంటలిజెన్స్ అధికారులను ఆదేశించారు.
 
దీనిపై ఆరా తీసిన ఇంటలిజెన్స్ సిబ్బంది.. రావెలను కలిసేందుకు ఆ రోజున సుమారు రెండు వందలమంది వచ్చారని, వాళ్ళు ఎందుకు వచ్చారో వారితో మంత్రి ఏం మాట్లాడారో తెలియజేస్తూ ఓ నివేదిక రూపొందించి సీల్డ్ కవర్‌లో బాబుకు అందజేసినట్టు తెలిసింది. ఆ కవర్‌ను చంద్రబాబు తన ఛాంబర్‌లోని సేఫ్ లాక్‌లో భద్రపరిచారట. ఈ కవరే రావెల రాజకీయ భవితవ్యాన్ని నిర్దేశిస్తుందని టీడీపీ నేతలు అంటున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Missing Chandrababu Security Forces Ap Minister Ravela Kishore Babu

Loading comments ...

తెలుగు వార్తలు

news

బీటెక్ పట్టభద్రుడి సోషల్ ఫ్రాడ్ ... 'క్లిక్కులు.. లైక్‌'ల పేరుతో రూ.3700 కోట్లు దోచేశాడు.. ఎలా?

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ బీటెక్ పట్టభద్రుడు సోషల్ ఫ్రాడ్‌కు పాల్పడ్డాడు. క్లిక్కు, ...

news

అటవీశాఖామంత్రిగా నారా లోకేష్‌..? బొజ్జల పదవి అనుమానమే..!

ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు అనుకున్నదే చేస్తున్నారు. తన కుమారుడిని ఎప్పటి నుంచో ...

news

డొనాల్డ్ ట్రంప్ హెయిర్ స్టైల్ సీక్రెంట్ ఏంటంటే? వ్యాయామం + డ్రగ్స్ తీసుకోవడమే

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటేనే ప్రస్తుతం ప్రపంచ దేశాలు గుర్రుగా ఉన్నాయి. ...

news

ఎయిర్‌సెల్-మాక్సిస్‌ కేసులో మారన్ సోదరులకు ఊరట.. సుప్రీం ఏం చెప్పిందంటే?

మాజీ టెలికాం మంత్రి దయానిధి మారన్, ఆయన సోదరుడు కళానిధి మారన్‌లకు సుప్రీం కోర్టు ...

Widgets Magazine