శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (14:52 IST)

ప్రత్యేక హోదా వచ్చిన రాష్ట్రాల్లో అభివృద్ధి నిల్.. అవాస్తవాలను నమ్మొద్దు: నారా లోకేష్

భారత దేశానికి రూపాయి పెట్టుబడి వస్తే అందులో 16 పైసలు ఏపీకి వస్తుందని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ప్రత్యేక హోదా వచ్చిన రాష్ట్రాల్లో అభివృద్ధి జరగలేదన్నారు. అలాగే విదేశీ పెట్టుబడుల్లో

భారత దేశానికి రూపాయి పెట్టుబడి వస్తే అందులో 16 పైసలు ఏపీకి వస్తుందని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ప్రత్యేక హోదా వచ్చిన రాష్ట్రాల్లో అభివృద్ధి జరగలేదన్నారు. అలాగే విదేశీ పెట్టుబడుల్లో ఎంత పెట్టుబడి ప్రత్యేక హోదా వచ్చిన రాష్ట్రాలకు వచ్చిందో తెలుసుకోవాలని ఆయన పేర్కొన్నారు.

ఏపీకి ప్రత్యేక హోదా గురించి కొందరు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని.. వాటిని నమ్మాల్సిన అవసరం లేదని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. కృష్ణా జిల్లా నిమ్మకూరులో జరిగిన ఓ కార్యక్రమంలో నారా లోకేష్ మాట్లాడుతూ.. ఏపీకి పెట్టుబడులు రావడానికి చంద్రబాబు నాయుడు నాయకత్వమే కారణమన్నారు. 
 
ఇదిలా ఉంటే.. విభజన హామీ మేరకు స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోయినా పర్లేదు కానీ.. రైల్వే జోన్ ఇచ్చి, రెవెన్యూ లోటును భర్తీ చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కోసం ప్రయత్నాలు జరిపామని, ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని చెప్పారు. ఇంకా రైల్వే జోన్ ఇవ్వాలని, రెవెన్యూ లోటు భర్తీ చేయాలని తాము కేంద్రప్రభుత్వాన్ని అడుగుతున్నట్లు చెప్పారు.