శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 5 డిశెంబరు 2018 (14:25 IST)

12 కేసుల్లో ఏ1గా వున్న వ్యక్తి.. చంద్రబాబును విమర్శించడమా?: సోమిరెడ్డి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబును ఏ వన్‌గా పరిగణించడంపై మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. గుడివాడ సభలో చిన్నాపెద్దా తేడా లే

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబును ఏ వన్‌గా పరిగణించడంపై మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. గుడివాడ సభలో చిన్నాపెద్దా తేడా లేకుండా సీఎం హోదాను మరిచిపోయి జగన్ నోటికొచ్చినట్లు రెచ్చిపోయాడని.. సోమిరెడ్డి ఫైర్ అయ్యారు.


తెలుగుదేశం పార్టీ అధినేత, సీఎం చంద్రబాబును జైలుకు పంపడం మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వల్లే కాలేదని సోమిరెడ్డి ఎద్దేవా చేశారు. అమరావతిలో మీడియా ప్రతినిధులతో సోమిరెడ్డి మాట్లాడుతూ, 12 కేసుల్లో ఏ వన్‌గా ఉన్న వ్యక్తి చంద్రబాబును విమర్శించడం దారుణమని విమర్శించారు.

ఐదున్నరేళ్లలో రాష్ట్రాన్ని దోచుకుని, వ్యవస్థను బ్రష్టు పట్టించింది మీరు కాదా అని వైయస్‌ను ఉద్దేశించి సోమిరెడ్డి అడిగారు. కేసుల కోసం ఆత్మగౌరవాన్ని మోదీకి జగన్ తాకట్టు పెట్టారని ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతులకు మేలు చేసి, ఏపీ రైతులకు కేంద్రం అన్యాయం చేస్తుందని కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.