రివర్ బోటింగ్ అడ్వంచర్ సంస్థకు మంత్రి అఖిలప్రియ అనుచరులకు లింకులున్నాయా?

సోమవారం, 13 నవంబరు 2017 (19:05 IST)

Akhilapriya

క్రిష్ణానదిలో పడవ ప్రమాదం జరిగి 16 మంది ప్రాణాలు కోల్పేయిన విషయం తెలిసిందే. ఇప్పటికే 9 మంది కనిపించకుండా పోయారు. కనిపించకుండాపోయిన తమవారి కోసం బంధువులు ఎదురుచూస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా రివర్ బోటింగ్ అడ్వంచర్ సంస్థ పడవలను నదిలో నడపడమే ప్రమాదానికి కారణమని పోలీసులు నిర్థారణకు వచ్చారు. 
 
అంతేకాదు 35 మందిని మాత్రమే ఎక్కించాల్సిన పడవలో 40 మందిని ఎక్కించడం, సేఫ్ జాకెట్స్ పర్యాటకులు అడిగినా ఇవ్వకపోవడంతో చాలామంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. దీనిపై వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించి సంఘటన ఎలా జరిగిందో వివరాలను ఆరా తీయాలని పర్యాటక శాఖామంత్రి అఖిలప్రియను ఆదేశించారు.
 
భూమా అఖిల ప్రియ వెంటనే ప్రమాదంపై పర్యాటక శాఖ అధికారులను ఆరా తీశారు. రివర్ బోటింగ్ అడ్వంచర్ సంస్థకు చెందిన కొండలరావు అనే వ్యక్తి అధికార తెలుగుదేశం పార్టీకి బాగా కావాల్సిన వ్యక్తి అని తేలింది. ఈయనకు భూమా అఖిలప్రియకు చెందిన కొంతమంది అనుచరులతో మంచి సంబంధాలే ఉన్నాయని సమాచారం. దీంతో ఆ విషయాన్ని మంత్రి దృష్టి తీసుకెళ్ళారట అఖిలప్రియ సన్నిహితులు. 
 
16 మంది మరణించిన తరువాత పూర్తిస్థాయిలో విచారణ తప్పదు కనుక తప్పు చేసినవారు ఎవరయినా తప్పదని మంత్రి వారికి చెప్పినట్లు సమాచారం. దీంతో ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక కొండలరావు ఆలోచనలో పడిపోయారట.దీనిపై మరింత చదవండి :  
Akhila Priya Boat Accident Krishna River Ap Tourism Minister

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఉద్ధానం తర్వాత కనిగిరిలోనే ఆ సమస్య ఎక్కువ... ఎమ్మెల్యే కదిరి బాబురావు

అమరావతి: శాసనసభలో కిడ్నీ బాధితులపై చర్చ జరిగినట్లు కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబురావు ...

news

మహిళ అకౌంట్ లోకి రూ.125 కోట్లు.. ఏం చేసిందంటే...

చేతిలో చిల్లిగవ్వ లేకప్పుడు ఎవరైనా అప్పు ఇస్తే బాగుండు అనుకుంటాం. అలా జరుగకుండా మన ...

news

ఫిలిప్పీన్స్‌లో పారతో మట్టిని తీసి రామాయణాన్ని తిలకించిన మోడీ...

ఫిలిప్పీన్స్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బిజీగా ఉన్నారు. లాస్ బానోస్ నగరంలో ఇంటర్నేషనల్ ...

news

షాకింగ్... శశికళ ఆస్తుల తనిఖీ కోసం ఐటీ 160 కార్లు, వాటి అద్దె ఎంతో తెలుసా?

జయలలిత నెచ్చెలి, జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళ ఆస్తులు తవ్వేకొద్దీ కోట్లలో తేలుతున్నట్లు ...