Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

'నపుంసక' టీచర్ ఉద్యోగం ఊడుతుందా? నన్నపనేని ఏమన్నారు?

సోమవారం, 4 డిశెంబరు 2017 (14:41 IST)

Widgets Magazine
sadist harrasment

తాను నపుంసకుడన్న విషయాన్ని బహిర్గతం చేసినందుకు శోభనం రాత్రి తన భార్యపై పైశాచికంగా ప్రవర్తించిన శాడిస్ట్ టీచర్ భర్తకు వ్యతిరేకంగా తెలుగు రాష్ట్రాల్లో తీవ్రవ్యతిరేకత పెల్లుబుకుతుంది. ఆ శాడిస్ట్‌పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పలువురు మండిపడుతున్నారు. అలాంటి కిరాతక చర్యకు పాల్పడిన అతను ఉపాధ్యాయుడిగా పనికిరాడనీ, తక్షణం విధుల నుంచి తొలగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. 
 
ఈ నరరూప రాక్షసుడి చేతిలో తీవ్రంగా దెబ్బలు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నవ వధువు శైలజను ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె శైల‌జ‌ను పరామర్శించి వివ‌రాలు తెలుసుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ శైల‌జ‌ భర్త రాజేష్‌పై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘ‌ట‌న‌పై తాము రాష్ట్ర స‌ర్కారుకి నివేదిక ఇవ్వనున్నట్లు చెప్పారు. శైల‌జ‌కు అండగా ఉంటామని ప్ర‌క‌టించారు.
 
కాగా, చిత్తూరు జిల్లా మోతరంగనపల్లిలో రాజేష్ అనే ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు త‌న‌కు పెళ్లి జ‌రిగిన కొన్ని గంట‌ల‌కే అంటే శోభనం రాత్రి తన భార్య‌ను గొడ్డును బాదిన‌ట్లు కొట్టిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఆ పెళ్లికూతురు శైల‌జ‌కి తిరుపతిలోని స్విమ్స్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతోంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

నా కొడుకు నపుంసుకుడైతే.. నేనున్నాగా... కోడలితో మామ..

సభ్య సమాజం మొత్తం తలదించుకోవాల్సిన సంఘటన ఇది. పెళ్ళయిన మొదటిరోజే భర్త శోభనం గదిలో నరకం ...

news

పవన్ కల్యాణ్‌కు తిక్కలేదు, లెక్క మాత్రం వుంది: జేసీ కుమారుడు

తెలుగుదేశం పార్టీ నేత జేసీ దివాకర్ రెడ్డి తన కుమారుడు జేసీ పవన్ రెడ్డిని అసెంబ్లీ ...

news

గాలిలో ఎగిరే పిజ్జాలను మీరెప్పుడైనా చూశారా?

వ్యోమగాములు ఆరోగ్యం పట్ల అధిక శ్రద్ధ తీసుకుంటారు. ఇందుకోసం పోషకాలు ఎక్కువగా ఉన్న ...

news

మానవత్వం మరిచిపోయారు.. గర్భిణీపై అత్యాచారయత్నం

ఇటీవలికాలంలో తెలంగాణా రాష్ట్రంలో నేరాలు, ఘోరాలు ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా, ...

Widgets Magazine