శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 25 జూన్ 2018 (13:27 IST)

చడీచప్పుడు లేకుండా వడ్డన.. కనీస చార్జీ రూ.10 : ఏపీఎస్ఆర్టీసీ చిల్లర చిట్కా

చిల్లర కొరత పేరుతో ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులపై అదనపు భారం మోపింది. ముఖ్యంగా, గుంటూరు జిల్లాలో ఆర్టీసీ యంత్రాంగం చడీచప్పుడు లేకుండా ఈ చార్జీలను పెంచేసింది. చిల్లర పేరుతో ఆర్టీసీ అధికారులు ప్రదర్శించిన త

చిల్లర కొరత పేరుతో ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులపై అదనపు భారం మోపింది. ముఖ్యంగా, గుంటూరు జిల్లాలో ఆర్టీసీ యంత్రాంగం చడీచప్పుడు లేకుండా ఈ చార్జీలను పెంచేసింది. చిల్లర పేరుతో ఆర్టీసీ అధికారులు ప్రదర్శించిన తెలివికి ప్రయాణికులు ఔరా అంటూ విస్తుబోతున్నారు.
 
ఆర్టీసీ బస్సు కండెక్టర్లను చిల్లర కష్టాలు వేధిస్తున్న విషయంతెల్సిందే. ఈ సమస్యను తొలగించాలంటూ వారు మొత్తుకుంటున్నారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా చార్జీలను పెంచేశారు. 
 
ఉదాహరణకు బెంగళూరుకు రూ.647 ఉంటే రూ.650 చేశారు. చెన్నైకు రూ.572 ఉంటే రూ.575 చేశారు. సాధారణంగా రెండు రూపాయల పైన ఉంటే ఐదుకు చేర్చినా ఫర్వాలేదు. 
 
కానీ, రేపల్లెకు వెళ్ళేటప్పుడు మాత్రం రూ.71 ఉంటే రూపాయి తగ్గిస్తే చిల్లర పని ఉండదు. కానీ దానిని కూడా ఏకంగా రూ.75 చేశారు. త్వరలో ఆర్డనరీ బస్సులకు కూడా ఇదే వర్తింప చేస్తామని దర్జాగా ప్రకటించారు. అంటే, ఇప్పుడు కనీస ఛార్జీగా ఉన్న రూ.6 కనుమరుగై రూ.10 అవుతుందన్నమాట!