శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By CVR
Last Updated : బుధవారం, 17 డిశెంబరు 2014 (11:54 IST)

నంద్యాలలో కానిస్టేబుల్ హత్య.. వేరువేరుగా తల.. మొండెం లభ్యం..!

కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలోని బండి ఆత్మకూరులో కానిస్టేబుల్‌ను నరికి దారుణంగా హత్య చేసి, తల ఒకచోట, మొండెం మరొక చోట విసిరిన గుర్తు తెలియని వ్యక్తుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. పోలీసుల కథనం మేరకు.. కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలోని బండి ఆత్మకూరులో ఏపీఎస్పీ 9వ బెటాలియన్కు చెందిన కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు దారుణ హత్యకు గరైయ్యాడు. 
 
అతడి తల బండి ఆత్మకూరులో కనిపించగా.. కోడూరు వద్ద మొండాన్ని ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో తల, మొండెంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా గత అయిదురోజుల క్రితం అదృశ్యమైన కానిస్టేబుల్ వెంకటేశ్వర్లుగా పోలీసులు గుర్తించారు. ఈ హత్య  రెండు రోజుల క్రితమే జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. 
 
కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆస్తి తగాదాలు, వివాహేతర సంబంధమా లేక ఇతర ఏమైనా కారణాల అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 
 
ఇటీవల తన కుటుంబాన్ని కర్నూలులో దింపిన వెంకటేశ్వర్లు తిరిగి వస్తున్న క్రమంలో అదృశ్యమైయ్యాడని పోలీసులు తెలిపారు.  తలతో పాటు ఏడమ చేతిని కూడా దుండగులు నరికి వేశారు.