శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By CVR
Last Updated : బుధవారం, 17 డిశెంబరు 2014 (15:44 IST)

తల ఇక్కడ.. మొండెం అక్కడ..! కానిస్టేబుల్ దారుణ హత్య...!

నంద్యాల సమీపంలోని బండి ఆత్మకూరులో ఏపీఎస్పీ 9వ బెటాలియన్కు చెందిన కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు దారుణ హత్యకు గురయ్యాడు. ఆయన తల ఒక చోట, మొండెం మరొక చోట కనిపించాయి. పోలీసుల కథనం ప్రకారం.. కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలోని బండి ఆత్మకూరులో ఏపీఎస్పీ 9వ బెటాలియన్ లో  కానిస్టేబుల్‌గా వెంకటేశ్వర్లు విధులు నిర్వహిస్తున్నారు. 
 
గత రెండు రోజుల క్రితం అదృశ్యమైన కానిస్టేబుల్ వెంకటేశ్వర్లుని గుర్తు తెలియని ముఠా హతమార్చింది. అతడి తల బండి ఆత్మకూరులో కనిపించగా.. కోడూరు వద్ద మొండాన్ని ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో తల, మొండెంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 
 
అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆస్తి తగాదాలు, వివాహేతర సంబంధమా లేక ఇతర ఏమైనా కారణాల అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తలతో పాటు ఏడమ చేతిని కూడా దుండగులు నరికి వేశారు.