గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Updated : సోమవారం, 11 జూన్ 2018 (20:57 IST)

ఆ ఎంపిపై చంద్రబాబు, లోకేష్‌‌లకు కోపమొచ్చిందా?

2014 సంవత్సరం సమయంలో రాయలసీమలో సిఎం రమేష్ ఏది చెబితే అదే జరిగింది. కానీ కొంతకాలంగా సిఎం రమేష్‌కు, చంద్రబాబులకు మధ్య గ్యాప్ రావడంతో సీనియర్ నేతలు పెదవి విప్పుతున్నారు. సిఎం రమేష్ పైన అసంతృప్తిగా ఉన్న న

2014 సంవత్సరం సమయంలో రాయలసీమలో సిఎం రమేష్ ఏది చెబితే అదే జరిగింది. కానీ కొంతకాలంగా సిఎం రమేష్‌కు, చంద్రబాబులకు మధ్య గ్యాప్ రావడంతో సీనియర్ నేతలు పెదవి విప్పుతున్నారు. సిఎం రమేష్ పైన అసంతృప్తిగా ఉన్న నేతలంతా అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నారట. నారా లోకేష్‌ కూడా సిఎం రమేష్‌ను పట్టించుకోవడం లేదని టిడిపి వర్గాలే బహిరంగంగా చెబుతున్నాయి.
 
టిడిపి రాజ్యసభ ఎంపి సి.ఎం.రమేష్‌ కడప జిల్లాపై పట్టుకోల్పోతున్నట్లు కనిపిస్తోంది. కొంతకాలంగా సిఎం రమేష్ వ్యవహారశైలిపై అధినేత చంద్రబాబునాయుడు కూడా ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతిపక్షనేత జగన్ సొంతజిల్లాలో బలపడాలని ఓ వైపు టిడిపి ప్లాన్ చేస్తుంటే మరోవైపు సిఎం రమేష్ వర్గ పోరును రెచ్చగొడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 
 
బద్వేలు, జమ్మలమడుగు, కమలాపురం ఇలా ప్రతి నియోజకవర్గంలో సిఎం రమేష్ అనసవరంగా వేలుపెడుతున్నారని టిడిపి ఇన్‌ఛార్జ్‌లు రగిలిపోతున్నారు. సిఎం రమేష్ హవా గతంలో ఉన్నంతంగా ఇప్పుడు లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. 2014 ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా సిఎం రమేష్ ఎవరికి చెబితే వారికే టిక్కెట్టు దక్కింది. కానీ ప్రొద్దుటూరు మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికలలో జరిగిన రగడతో సిఎం రమేష్‌కు చంద్రబాబుకు మధ్య దూరం పెరిగినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ మాటను ధిక్కరించి వైసిపి నుంచి కౌన్సిలర్‌ను ఛైర్మన్ చేసే ప్రయత్నం చేశారన్న ఆరోపణలు సైతం వచ్చాయి.
 
సిఎం రమేష్‌ను పక్కనబెట్టి, మండలి డిప్యూటీ ఛైర్మన్ సతీష్ రెడ్డిని ఎంకరేజ్ చేస్తున్నారట. దీంతో సిఎం రమేష్ పైన ఇంతకాలం అసంతృప్తితో రగిలిన నేతలంతా గళం విప్పుతున్నారట. సిఎం రమేష్ వ్యవహారశైలిపై గతంలో ఎన్నో ఫిర్యాదులు ఉన్నా అప్పట్లో చంద్రబాబు పెద్దగా పట్టించుకోలేదు. కానీ తాము తీసుకున్న నిర్ణయాలను కాదని ఇష్టానుసారం సిఎం.రమేష్ కొన్ని నిర్ణయాలు తీసుకోవడం మాత్రం చంద్రబాబుకు ఏ మాత్రం ఇష్టం లేదట. మరి ఈ రాజకీయాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయో చూడాలి.