శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 6 సెప్టెంబరు 2019 (18:28 IST)

తిరుమల కొండపై అసత్య ప్రచారం చేసిన వ్యక్తుల అరెస్ట్

తిరుమల కొండపై చర్చి వుందటూ అసత్య ప్రచారం, వక్రికరించిన పోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు తిరుపతి అర్భన్ జిల్లా ఎస్పి అన్బురాజన్ తెలిపారు.
 
 తిరుపతిలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఎస్పీ అన్బూరాజన్ మాట్లాడుతూ.. హైదరాబాదుకు చెందిన అరుణ్, కార్తీక్ లు, గుంటూరుకు చెందిన అజిత్ సాయి తిరుమల కొండల్లో చర్చి వుందని చూపుతూ పారెస్ట్ సెల్ టవర్ బిల్డింగును మరియు ఇదిగో దానిపైన వున్న సిలువ పోటో అంటూ ఆ టవర్ పైన కెమెరాను అమర్చే ఇనప కమ్మిని పోటో తీసి సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసిన వీరిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ వివరించారు.
 
విలేకర్ల సమావేసంలో తిరుమల డి.ఎస్పి. ప్రభాకర్, తిరుమల సిఐ చంద్రశేఖర్ లు పాల్గొన్నారు.