గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 22 మే 2015 (19:17 IST)

నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం: భూమిపూజకు స్థలం సిద్ధం!

నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి వచ్చే నెల ఆరో తేదీన శంకుస్థాపన చేయనున్న సంగతి తెలిసిందే. భూమిపూజకు ఎక్కడ అనుకూలత ఉంటుందన్న దానిపై అధికారులు, వాస్తు సిద్ధాంతులు రాజధాని ప్రాంతంలో విస్తృతంగా పర్యటించారు. చివరికి, రాజధాని ప్రాంతానికి ఈశాన్యంలో ఉన్న తాళ్లాయపాలెంను ఎంపిక చేసినట్టు సమాచారం. 
 
తుళ్లూరు మండలంలోని ఈ గ్రామం శైవక్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది. పైగా కృష్ణాతీరాన ఉండడం అదనపు అనుకూలత అని అధికారులు అంటున్నారు. అంతేగాకుండా.. రాజధాని భూసమీకరణలో ఇక్కడి రైతుల భాగస్వామ్యమే ఎక్కువ. దీంతో, ఇక్కడే భూమిపూజ చేయాలని సర్కారు నిర్ణయించింది. దీనిపై, శుక్రవారం జరిగే క్యాబినెట్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటారు.