అప్పు తీర్చమన్నందుకు బాణాలతో దాడి..

మోహన్| Last Updated: బుధవారం, 17 ఏప్రియల్ 2019 (17:42 IST)
కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. డబ్బుల కోసం ఇద్దరు చెంచుల మధ్య తలెత్తిన వివాదం చివరకు ప్రాణాల మీదకు తెచ్చింది. కొట్టాలచెరువుగూడేనికి చెందిన ఉత్తలూరి అనే యువకుడిని అదే గూడానికి చెందిన అంకన్న బాణాలతో దాడి చేశాడు. లింగన్నకు చెందిన ద్విచక్రవాహనాన్ని అంకన్న అవసరం నిమిత్తం తీసుకున్నాడు. 
 
కాగా వాహనం మరమత్తుకు వచ్చింది. ఈ క్రమంలోనే తన వాహనాన్ని బాగు చేయించి ఇవ్వాలంటూ లింగన్న కోరాడు. అందుకు అంకన్న కూడా అంగీకరించాడు. రోజులు గడుస్తున్నా కూడా పట్టించుకోలేదు. లింగన్న నిలదీయడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉన్న అంకన్న కోపంతో ఇంట్లో ఉన్న బాణంతో దాడి చేశాడు. 
 
ఈ దాడిలో లింగన్నకు ఛాతి, వీపు భాగాల్లో రెండు బాణాలు గుచ్చుకున్నాయి. వెంటనే లింగన్నను తన కుటుంబసభ్యులు ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కర్నూలులో ఉన్న జనరల్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే నిందితుడు స్వయంగా వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం.దీనిపై మరింత చదవండి :