Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సిగరెట్లలో నింపి గుప్పుమంటూ పీల్చుతూ బీటెక్ విద్యార్థుల గం'జాయ్'

ఆదివారం, 16 జులై 2017 (13:19 IST)

Widgets Magazine
drug addiction

హైదరాబాద్ నగరంలో వెలుగు చూసిన డ్రగ్స్ గుట్టు సంచలనం రేపుతోంది. ఇంతలో బీటెక్ విద్యార్థుల గంజాయి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సిగరెట్లలో గంజాయి నింపి గుప్పుమంటూ పీల్చుతూ బీటెక్ విద్యార్థుల ఎంజాయ్ చేస్తున్న వైనం హైదరాబాద్ నాగోల్‌లో బహిర్గతమైంది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఎన్విరాన్‌ టవర్స్‌ అపార్టుమెంట్ల సముదాయంలో ట్రిపుల్‌ బెడ్‌రూం ఫ్లాట్‌లో కొందరు యువకులు గంజాయి తాగుతున్నట్లు సమాచారం అందింది. ఎల్బీనగర్‌ పోలీసులు శుక్రవారం రాత్రి అక్కడికి వెళ్లి తనిఖీలు చేపట్టగా ఐదుగురు యువకులు గంజాయి తాగుతూ పట్టబడ్డారు. నిందితులను ఎల్‌బీనగర్‌ నాగార్జున కాలనీలో ఉండే ఎల్‌ఎల్‌బీ విద్యార్థి కనమంత సాయి అనిరుధ్‌ రెడ్డి(20), నాగోల్‌కు చెందిన ఇంజనీరింగ్‌ విద్యార్థి మారం సాయి ప్రణీత్‌రెడ్డి(19), నాగోల్‌కు చెందిన బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ స్టూడెంట్‌ రామగిరి ఫెలెక్స్‌ (19) వరంగల్‌ ఘన్‌పూర్‌ చెల్పూరుకు చెందిన ఇంజనీరింగ్‌ విద్యార్థి వీరమనేని దిలీప్‌(21), వరంగల్‌ పర్కాల్‌ గ్రామానికి చెందిన బలుగూరి శ్రీకాంత్‌రావు(21)గా గుర్తించారు. 
 
నిందితులంతా గంజాయికి బానిసలైనట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ యువకులపై కేసు నమోదు చేసి, రిమాండుకు తరలించారు. వీరి నుంచి 2 గంజాయి పాకెట్లు(50 గ్రాములు), లైటర్‌, 5 సెల్‌ఫోన్లు, తాగి పారేసిన సిగరెట్‌ పీకలు, సిగరెట్‌ యాష్‌, యాష్‌ ట్రే (పరిశోధన నిమిత్తం) స్వాధీనం చేసుకున్నారు. వీరిలో ముగ్గురు బీటెక్‌ విద్యార్థులే కావడం విశేషం.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

మోడీ విదేశీ టూర్ ఖర్చులడిగితే... ప్రశ్నలో అస్పష్టత ఉందంటూ జవాబు దాటేసిన పీఎంఓ!

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విదేశీ పర్యటన ఖర్చులు ఇవ్వండి అంటూ సమాచార హక్కు ఉద్యమకారిణి ...

news

అదృష్టమో... దురదృష్టమో ఆ మంత్రి నారా లోకేష్... బుట్టా రేణుక

ఏపీ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి హోదాలో ఉన్న నారా లోకేశ్‌ను అభివృద్ధి పనుల విషయంగానే తాను ...

news

174 మంది ప్రాణాలు తీయబోయిన పక్షి.. ఎలా?

ఓ పక్షి ఏకంగా 174 మంది ప్రాణాలు తీయబోయింది. ఫలితంగా రాంచీ విమానాశ్రయం నుంచి న్యూఢిల్లీకి ...

news

గోవును చంపితే 14 యేళ్ళు.. మనిషిని చంపితే రెండేళ్లు : న్యాయ వ్యవస్థలో లోపాలు

దేశ న్యాయవ్యవస్థలోని లోపాలను పలువురు న్యాయకోవిదులు ఎత్తిచూపుతున్నారు. ఎందుకంటే.. గోవును ...

Widgets Magazine