బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 27 అక్టోబరు 2017 (14:30 IST)

అమ్మాయిలకేమైంది : ఓ విద్యార్ధిని ఆత్మహత్య.. మరో ఐటీ ఉద్యోగిని మిస్సింగ్

ఇటీవలికాలంలో బలవన్మరణాలకు పాల్పడుతున్న యువతుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. తాజాగా ఓ బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోగా, ఐటీ ఉద్యోగిని మిస్సింగ్ అయ్యారు. మానసిక ఒత్తిడి వల్ల కొందరు బలవంతంగా ప్రాణాల

ఇటీవలికాలంలో బలవన్మరణాలకు పాల్పడుతున్న యువతుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. తాజాగా ఓ బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోగా, ఐటీ ఉద్యోగిని మిస్సింగ్ అయ్యారు. మానసిక ఒత్తిడి వల్ల కొందరు బలవంతంగా ప్రాణాలు తీసుకుంటుంటే.. మరికొందరు ఇంట్లో నుంచి ఎటో వెళ్లిపోతున్నారు. ఒకే రోజు హైదరాబాద్‌లో జరిగిన రెండు వేర్వేరు ఘటనలు కలకలం రేపాయి. 
 
వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీలో స్వప్న అనే విద్యార్థిని బీటెక్ చదువుతోంది. ప్రస్తుతం నాలుగో సంవత్సరం. గురువారం సాయంత్రం హాస్టల్‌లో ఎవరూలేని సమయంలో ఉరివేసుకుని చనిపోయింది. 10 రోజులుగా ఆరోగ్యం బాగోలేదని చెబుతోంది. దీంతో రెండు రోజుల క్రితం ఇంటికి వెళ్లి.. మళ్లీ హాస్టల్‌కు వచ్చింది. జ్వరంగా ఉందని అక్టోబరు 26వ తేదీ గురువారం క్లాసులకు అటెండ్ కాలేదు. 
 
సాయంత్రం తరగతులు ముగించుకుని హాస్టల్‌కు వచ్చిన తోటి విద్యార్ధినీలు.. స్వప్న ఉరి వేసుకుని ఉండటం చూసి షాక్ అయ్యారు. కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పేరంట్స్ మాత్రం ఈ విషయంతో కన్నరుమున్నీరు అవుతున్నారు. చనిపోవాల్సిన అంత కష్టం ఎందుకు వచ్చిందో అర్థం కావటం లేదంటున్నారు. ఇంట్లో ఎలాంటి సమస్యలు, ఇబ్బందులు కూడా లేవంటున్నారు.
 
అలాగే, హైదరాబాద్ నాగోల్‌లో ఓ యువతి అదృశ్యమైంది. పి.స్వాతిరెడ్డి (29) నాగోల్‌ ఆదర్శ నగర్‌లో నివాసం ఉంటుంది. ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో.. సిస్టమ్‌ అనలిస్ట్‌గా పని చేస్తుంది. రెండు రోజుల క్రితం (అక్టోబర్ 25వ తేదీ ఉదయం) ఇంట్లో నుంచి వెళ్లింది. 
 
అప్పటి నుంచి తిరిగి రాలేదు. స్నేహితులు, బంధువుల ఇంట్లో ఆచూకీ కోసం వెతికినా ఫలితం దక్కలేదు. గురువారం రాత్రి సోదరుడు ఘల్గుణ రెడ్డి ఎల్బీ నగర్ పోలీసులకు కంప్లయింట్ చేశాడు. స్వాతిరెడ్డి మానసిక ఒత్తిడితో బాధపడుతుందని చెబుతున్నాడు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.