శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , ఆదివారం, 30 ఏప్రియల్ 2017 (08:16 IST)

బాహుబలి-2 తొలిరోజు కలెక్షన్లు దేశంలో 121 కోట్లు.. ప్రపంచవ్యాప్తంగా 217 కోట్లు

ఇది నిజం. బాహుబలి-2 కలెక్షన్ల రికార్డులను బాది పడేసింది. శుక్రవారం విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాహుబలి2 చిత్రం ఒక్క భారత దేశంలోనే తొలిరోజు 121 కోట్లు వసూలు చేయగా ప్రపంచ వ్యాప్తంగా 217 కోట్లు వసూలు చేసి అంతర్జాతీయ చలన చిత్ర పరిశ్రమను నివ్వెరపర

ఇది నిజం. బాహుబలి-2  కలెక్షన్ల రికార్డులను బాది పడేసింది. శుక్రవారం విడుదలై  ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాహుబలి2 చిత్రం ఒక్క భారత దేశంలోనే తొలిరోజు 121 కోట్లు వసూలు చేయగా ప్రపంచ వ్యాప్తంగా 217 కోట్లు వసూలు చేసి అంతర్జాతీయ చలన చిత్ర పరిశ్రమను నివ్వెరపరిచింది. ఎస్‌.ఎస్‌.రాజమౌళి తెరకెక్కించిన ఈ అద్భుత దృశ్య కావ్యం తొలి రోజు భారత్‌లో రూ.121 కోట్లు వసూలు చేసినట్లు సినీ విశ్లేషకుడు తరుణ్‌ ఆదర్శ్‌ ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. ‘‘బాహుబలి2’ చరిత్ర సృష్టించింది. విస్మయం.. ఆశ్చర్యం.. మాటలు రావడం లేదు.. భారత్‌లో శుక్రవారం రూ.121 కోట్లు వసూలు చేసింది. ఇందులో హిందీ రూ.41కోట్లు.. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం నాలుగు భాషల్లో రూ.80కోట్లు వచ్చాయి’ అని తరుణ్‌ ఆదర్శ్‌ ట్వీట్‌ చేశారు. మరోవైపు ఒక్క అమెరికాలోనే ఈ చిత్రం రూ.29 కోట్లు వసూలు చేసినట్లు వెల్లడించారు.
 
బాహుబలి సినిమాలో యుద్ద సన్నివేశాల్లో శత్రువులను హతమార్చిన విధంగా బాహుబలి2 అన్ని కలెక్షన్ల రికార్డులను పాతరేసిందని కరణ్ జోహార్ ధర్మా ప్రొడక్షన్స్ సీఈఓ అపూర్వ మెహతా ట్వీట్ చేశారు. 
భారతదేశంలో ఓపెనింగ్ డేలో వంద కోట్లకుపైగా కలెక్షన్లు సాధించిన ఏకైక చిత్రంగా బాహుబలి చరిత్రను తిరగరాసింది. ఏ భారతీయ సినిమా కూడా బాక్సాఫీసు వద్ద ఈ రకం కలెక్షన్లను ఈ 80 ఏళ్లలో ఇంతవరకూ సాధించలేదు. 2017లో షారూక్ ఖాన్ నటించిన రాయిస్ చిత్రం తొలిరోజు రూ.20,42 కోట్లు సాధించింది. ఈ నాలుగునెలల్లో ఇదే అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్ చిత్రం కాగా, ఇప్పుడు బాహుబలి సునామీని సృష్టించింది.
 
ట్రైలర్‌తోనే రికార్డులకు శ్రీకారం చుట్టిన ఈ చిత్రం ఇక కలెక్షన్ల రికార్డును తిరగరాసేందుకు సిద్ధమైంది. రెబల్‌స్టార్ ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా తదితర తారలు నటించిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా 6500 థియేటర్లలో విడుదలైంది. ప్రపంచ వ్యాప్తంగా 9 వేలకి పైగా స్కీన్లపై ప్రదర్శితమవుతోంది. భారత దేశంలో ఇప్పటి వరకు ఏ సినిమా సాధించలేని ఘనతను సొంతం చేసుకుంటూ.. బాక్సాఫీసు వద్ద రోజుకో రికార్డు తెరపైకి తెస్తోంది.
 
శనివారం రాత్రి 10 గంటలకు అందిన సమాచారం ప్రకారం ఫిలిం ట్రేడ్ అనలిస్టు రమేష్ బాలా బాహుబలి సినిమా శుక్రవారం కలెక్షన్లను కిందివిధంగా ప్రకటించారు
నెట్ : 121 కోట్లు
గ్రాస్ : 152 కోట్లు
ఓవర్సీస్ : 65 కోట్లు
ప్రపంచం మొత్తంలో 217 కోట్లు (గ్రాస్ ప్లస్ ఓవర్సీస్ కలుపుకుంటే)
 
భారత్‌లోనే కాదు.. అమెరికా, ఆస్టేలియా, యుఎఇ దేశాల్లో కూడా కలెక్షన్ల పరంగా నంబర్ వన్ పొజిషన్‌ను సొంతం చేసుకుంది.
 
శనివారం 10 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం.. బాక్సాఫీసు వద్ద బాహుబలి2 అంచనాలిలా ఉన్నాయి...
హిందీ మార్కెట్లు -రూ. 35 కోట్లు
నైజాం/ఆంధ్రా - రూ. 45 కోట్లు
తమిళనాడు - రూ. 14 కోట్లు
కర్నాటక - రూ. 10 కోట్లు
కేరళ - రూ.4 కోట్లు.
 
తొలిరోజు వసూళ్లలో ‘దంగల్‌’ రికార్డును బాహుబలి 2 బద్దలుకొట్టింది. అమెరికాలోనూ ‘బాహుబలి 2’ ప్రభంజనం సృష్టిస్తోంది. తొలిరోజు రూ.29.60 కోట్లు వసూలు చేసింది. అమెరికాలో ఓ భారతీయ సినిమాకు తొలిరోజు దక్కిన అత్యధిక వసూళ్లు ఇవే కావడం విశేషం. ఈ చిత్రానికి అభిమానుల్లో దొరికిన ఆదరణను బట్టి చూస్తే... ‘బాహుబలి2 - ది కంక్లూజన్’ భారత సినిమా చరిత్రలోనే అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా దూసుకెళ్తోంది.