Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

శ్రీవారి ఆలయంలో బాలుడి కిడ్నాప్.. సీసీటీవీ కెమెరాల్లో నిందితుడి దృశ్యాలు..

బుధవారం, 14 జూన్ 2017 (11:00 IST)

Widgets Magazine
tirumala

శ్రీవారి ఆలయంలో నేరాలు అధికమైపోతున్నాయి. తిరుమల వెంకన్న ఆలయంలో ఓ బాలుడు కిడ్నాప్‌కు గురైయ్యాడు. స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన ఓ జంట ఆదమరిచి నిద్రిస్తుండగా వారి కుమారుడిని ఓ దుండగుడు కిడ్నాప్ చేశాడు.
 
వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా వజ్రకరూర్ మండలంలోని సాయిపురం గ్రామానికి చెందిన వెంకటేశ్ దంపుతులు మంగళవారం స్వామి వారి దర్శనం కోసం వచ్చారు. మంగళవారం రాత్రి కావడంతో శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న గొల్లమండంపం దగ్గర తమ కుమారుడు(1) చెన్నకేశవులుతో కలిసి నిద్రించారు. దంపతులిద్దరూ గాఢనిద్రలో ఉండగా గుర్తుతెలియని వ్యక్తి బాబును ఎత్తుకెళ్లిపోయాడు.
 
ఈ విషయం తెలిసి బాలుడి తల్లి బోరున విలపించింది. ఈ ఘటనపై తిరుమల టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బాలుడి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. విచారణలో భాగంగా ఆలయంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించిన పోలీసులకు నిందితుడి దృశ్యాలు కనిపించాయి. వాటి ఆధారంగా ఆ దొంగను పట్టుకోవడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఎలా అత్యాచారం జరిగిందో బొమ్మ గీసి చూపించింది.. నిందితుడికి ఐదేళ్ల జైలు

తనపై జరిగిన అఘాయిత్యాన్ని బాలిక ఓ పేపర్‌పై బొమ్మలేసి చూపించి జరిగిన దాన్ని కళ్లకు ...

news

అగ్నికి ఆహుతైన లండన్‌ గ్రెన్ ఫెల్ టవర్‌: ఒకటే దారి.. వందలాది మంది సజీవదహనం..

లండన్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో వందలాది మంది సజీవదహనమై వుంటారని ...

news

బంగ్లాదేశ్‌లో భారీ వర్షాలు: 107 మందికిపైగా మృతి.. వంద మందికిపైగా గాయాలు

బంగ్లాదేశ్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కుండపోతగా కురుస్తున్న వానల ధాటికి ...

news

ఆ గ్రామంలో ఐదు రోజులు మహిళలు దుస్తులు వేసుకోరట.. భార్యతో భర్త ఒక్క మాట కూడా?

హిమాచల్ ప్రదేశ్‌లోని వీణా అనే గ్రామంలో ప్రజల జీవనశైలి వింతగా వుంటుంది. ఇప్పటికీ అక్కడి ...

Widgets Magazine