బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : సోమవారం, 2 మార్చి 2015 (20:58 IST)

దిక్కులేని రాష్ట్రానికి దారి చూపలేకపోయారు..? ఇది దారుణం.. : బాలయ్య

‘విభజనే చాలా దారుణంగా, అన్యాయంగా జరిగింది. అప్పటి నుంచి రాష్ట్రానికి దిక్కులేదు. అనాథగా మారిపోయింది. కనీసం రాజధాని కూడా లేదు.  ఇలాంటి రాష్ట్రాన్ని అనాథగానే వదిలేశారు. ఇది దారుణం’ ఇలా వ్యాఖ్యానించింది సినీ హీరో, హిందూపురం ఎమ్మల్యే బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన హిందూపురంలోని గ్రామాలలో సాగునీటిపారుదల శాఖా మంత్రి ఉమామహేశ్వర రావుతో కలసి పర్యటించారు. 
 
వివిధ సాగునీటి ప్రాజెక్టులు కేవలం  ధనయజ్నంలా మారిపోయిందన్నారు. సాగునీటి ప్రాజెక్టులను త్వరితిగతి పూర్తి చేయిస్తామని చెప్పారు. అయితే రాష్ట్ర విభజన సమయంలో తీరని నష్టం జరిగిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ చాలా అన్యాయంగా రాష్ట్రాన్ని విభజించారని ఆరోపించారు. దిక్కులేనిదిగా, అనాథగా, రాజధాని లేనిదిగా మారిపోయిన రాష్ట్రాన్ని కేంద్రం చాలా నిర్లక్ష్యంగా వదిలేసిందని ఆరోపించారు. ఇది తగదన్నారు. 
 
ఇప్పటికైనా రాష్ట్రంలోని ఇబ్బందులను, సమస్యలను గుర్తించి నిధులు విడుదల చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గ్రామీణాభివృద్ధికి కేంద్రం చేసింది చాలా తక్కువని ఆయన ఆరోపించారు. నిధులు రాకపోవడంతో ఆందోళనలు పెరుగుతున్నాయని చెప్పారు.