Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆ పనిచేయడంలో బాబు కన్నా బాలక్రిష్ణే బెటర్... ఎమ్మెల్యే రోజా...

సోమవారం, 29 మే 2017 (12:39 IST)

Widgets Magazine
Roja

సంచలనానికి మారుపేరు రోజా. ఆమె నోరు తెరిచిందంటే చాలు, ప్రత్యర్థులు నోరు మూసుకోవాల్సిందే. అధికార తెలుగుదేశం పార్టీ నేతలైతే చెప్పనవసరం లేదు. చెవులు, నోరు రెండూ మూసేసుకుంటారు. వ్యక్తిగతంగా కూడా రోజా విమర్శలు చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంది. వైజాగ్‌లో జరుగుతున్న మహానాడును పనికిరాని మహానాడంటూ వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగలేదు. తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు కన్నా బాలక్రిష్ణే ఎంతో బెటరని, బాబు నోరు తెరిస్తే అంతా అబద్ధాలేనన్నారామె.
 
ప్రజలను మోసం చేయడంలో బాబును మించిన సిద్ధహస్తుడు మరొకరు లేరని, మసిబూసి మారేడు కాయి చేయడంలో బాబుది అందవేసిన చేయిగా అభివర్ణించారు. మామను వెన్నుపోటు పొడిచిన బాబు ఏమీ తెలియని అమాయకుడి లాగా ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని చెప్పడం మరింత విడ్డూరమన్నారు. ప్రజలు బాబు పాలనపై విసిగిపోయారని, తెలుగుదేశం పార్టీకి చంద్రబాబుకన్నా బాలక్రిష్ణ అధ్యక్షుడుగా ఉండటం ఉత్తమమని చెప్పారు. 
 
ఎన్‌టిఆర్ ఆశలు, ఆశయాలు నెరవేరాలంటే బాలక్రిష్ణకు పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వాలంటున్నారు రోజా. అయితే రోజా వ్యాఖ్యలపై టిడిపి నాయకులు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఎందుకంటే మహానాడులో నాయకులందరూ బిజీగా ఉండటంతో ఆమె వ్యాఖ్యలు టిడిపి నేతలు పెద్దగా పట్టించుకున్నట్లు లేదు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

శ్రీవారి భక్తులూ... ఈ నెల 30న తిండి దొరకదు... తస్మాత్ జాగ్రత్త...

హోటల్ రంగంపై జిఎస్‌టి విధానంలో పెంచిన పన్ను శాతాన్ని తగ్గించాలని కోరుతూ మే 30వ తేదీన ...

news

మహాత్మాగాంధీ హత్య.. ఆ నాలుగో బుల్లెట్ ఎవరు కాల్చారు.. అది గాడ్సే పిస్టల్ నుంచి పేలలేదా?

జాతిపిత మహాత్మాగాంధీ.. అహింస కోసం ప్రాణం ఇచ్చారు. శాంతియుతంగా పోరాడి దేశానికి ...

news

భోజనం కోసం కూర్చునే చోట.. మూత్రవిసర్జన వద్దన్న ఆటో డ్రైవర్.. చంపేసిన యువకులు.. ఎక్కడ?

దేశ రాజధాని నగరం ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. బహిరంగ ప్రదేశంలో మూత్రవిసర్జన చేస్తున్న ...

news

కుమారుడు తాగుబోతు.. కోడలిపై కన్నేసిన మామ... ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని..?

కోడలిపై కన్నేశాడు. తండ్రిలా కాపాడాల్సిన మామే లైంగిక వేధింపులకు గురిచేశాడు. కొడుకు ...

Widgets Magazine