Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బాలకృష్ణపై హిందూపురం ప్రజలు గుర్రుగా వున్నారా? ఎందుకు?

శనివారం, 15 జులై 2017 (18:19 IST)

Widgets Magazine
Balakrishna

బాలకృష్ణ. నందమూరి కుటుంబంలో ప్రస్తుతం కీలక రాజకీయ నేతగా ఉన్న వ్యక్తి. ఎప్పటి నుండో తండ్రి రాజకీయాల్లో ఉన్నా ఆ రంగం వైపు వెళ్ళకుండా సినిమాల్లో ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడుతో పాటు అభిమానుల ఒత్తిడితో రాజకీయాల్లోకి వచ్చిన బాలకృష్ణ అనంతపురం జిల్లా హిందుపురం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇది తెలిసిందే. అయితే ప్రజాప్రతినిధిగాను, సినిమాల్లోను రెండింటికి పూర్తిస్థాయిలో బాలకృష్ణ న్యాయం చేయలేకపోతున్నారన్న విమర్శలు లేకపోలేదు. 
 
అందుకు కారణం అభివృద్ధి జరగకపోవడమే. సినిమాల్లో బిజీగా ఉన్న బాలకృష్ణ పెద్దగా నియోజవర్గాల్లో పర్యటించలేదట. అప్పుడప్పుడు పర్యటించి వెళ్ళిపోతున్నారు. అభివృద్ధి కార్యక్రమం పూర్తిగా కుంటుపడుతోంది. దీంతో నియోజకవర్గ ప్రజలు బాలకృష్ణపై కోపంతో ఉన్నారట. విషయాన్ని స్థానిక నేతల ద్వారా తెలుసుకున్న బాలకృష్ణ ఎలాగైనా తిరిగి ప్రజల ఆదరాభిమానాలను పొందాలని, దాంతో పాటు హిందూపురంలో మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచి తీరాలన్న ఆలోచనలో ఉన్నారట. ఇప్పటికే కొంతమంది సలహాలను తీసుకున్న బాలకృష్ణ తనపై ప్రజలకు ఉన్న కోపాన్ని పోగొట్టాలంటే ఏం చేయాలా అని చర్చించారట. 
 
కనీసం వారానికి ఒకసారైని నియోజవర్గంలో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకోవాలని, మారుమూల ప్రాంతాల్లో ఉన్న గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తే తిరిగి తనను ఆదరిస్తారని తెలియడంతో ఆవైపు బాలకృష్ణ అడుగులు వేస్తున్నారట.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

జగన్ పాదయాత్ర... పవన్ రథయాత్ర... మరి బాబు ఏం యాత్ర?

ఎన్నికల వేడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెల్లమెల్లగా రాజుకుంటోంది. ఇప్పటికే వైసీపీ అధినేత ...

news

వైసీపీ నుంచి టీడీపీకి బుట్టా రేణుక జంప్? నారా లోకేష్‌ను ఎందుకు కలిశారు..?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ ద్వారా తెలుగుదేశం పార్టీపై, ఆ పార్టీ అధినేత, నాయకులపై ...

news

అకున్... డ్రగ్స్ రాయుళ్ల తాటతీయ్... శెలవు రద్దు చేసిన టి.ప్రభుత్వం

ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ అకున్ సబర్వాల్ శెలవుపై వెళ్లనున్నారన్న నేపధ్యంలో డ్రగ్స్ దందాపై ...

news

మోడీ గారూ.. ట్రిపుల్ తలాక్‌ను పక్కనబెట్టండి.. మీ భార్య సంగతేంటో చూడండి!

ట్రిపుల్ తలాక్ సంగతిని కాసేపు పక్కనబెట్టి.. తన భార్య సంగతేంటో ముందుగా తేల్చుకోవాలని.. ...

Widgets Magazine