గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 19 సెప్టెంబరు 2014 (16:27 IST)

బక్రీద్ : గోవధపై నిషేధం.. ఉల్లంఘిస్తే.. శిక్ష తప్పదు!

బక్రీద్ సందర్భంగా గోవధపై నిషేధం విధించినట్లు పోలీసులు తెలిపారు. బక్రీద్ నాడు ఆంధ్రప్రదేశ్ ప్రొహిబిషన్ ఆఫ్ కౌ స్లాటర్ అండ్ యానిమల్ ప్రిజర్వేషన్ యాక్ట్ ప్రకారం ఆవులను, ఆవు దూడలను కబేళాలకు అమ్మడాన్ని, కొనుగోలు చేయడాన్ని నిషేధించినట్టు పోలీసులు వెల్లడించారు. 
 
బక్రీద్ సమయంలో ఆవులను, గేదెలను కబేళాల వద్ద కొనుగోలు చేయరాదని, కేవలం ఆంబోతులు, దున్నపోతులను మాత్రమే కొనాలని కబేళాల యజమానులకు పోలీసులు సూచించారు. 
 
ఈ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘించి కబేళాలకు వీటిని అమ్మినా, గోవధకు పాల్పడినా చట్టపక్రారం శిక్ష తప్పదని పోలీసులు హెచ్చరించారు.