గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 27 జూన్ 2017 (09:21 IST)

తలుపు సందులోంచి చూసినప్పుడు శిరీషను ఎస్సై అత్యాచారయత్నం చేస్తున్నట్లు కనిపించింది..

హైదరాబాద్ ఆర్జే స్టూడియోలో ఆత్మహత్యకు పాల్పడిన శిరీష కేసులో చిక్కుముడులు వీడుతున్నట్లు కనిపిస్తోంది. బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య ఘటనలో రెండు రోజుల కస్టడీకి తీసుకున్న పోలీసులు ఏ2 నిందితుడు రాజీవ్ వద్ద వ

హైదరాబాద్ ఆర్జే స్టూడియోలో ఆత్మహత్యకు పాల్పడిన శిరీష కేసులో చిక్కుముడులు వీడుతున్నట్లు కనిపిస్తోంది. బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య ఘటనలో రెండు రోజుల కస్టడీకి తీసుకున్న పోలీసులు ఏ2 నిందితుడు రాజీవ్ వద్ద విచారణ చేపట్టారు. ఈ విచారణ సందర్భంగా రాజీవ్ కీలక విషయాలు వెల్లడించాడని తెలుస్తోంది. పెళ్లికి ముందే శిరీషను, తేజస్విని కూడా వదిలించుకోవాలనే ఉద్దేశంలో ఉన్నానని చెప్పాడు. 
 
ముందు తేజస్వినిని వదిలించుకుని.. ఆపై శిరీషను వదిలించుకోవచ్చనుకున్నానని రాజీవ్ పోలీసులతో చెప్పాడు. అందుకే తేజస్వినిని వదిలించుకునేందుకు.. శ్రవణ్ సూచనతోనే కుకునూరుపల్లి ఎస్సై దగ్గరకు తీసుకువెళ్లానని తెలిపాడు. 
 
శ్రవణ్, తాను బయటకు వచ్చామని, తర్వాత మళ్లీ లోపలకు వెళుతూ, తలుపు సందులోంచి చూసినప్పుడు శిరీషను ఎస్సై అత్యాచారయత్నం చేస్తున్నట్టు కనిపించిందని, ఆ తర్వాత తిరిగి వస్తున్నప్పుడు కారులో అరిచి గోలచేయడంతో రెండు మూడు సార్లు కొట్టానని రాజీవ్ తెలిపాడు. మంగళవారం కూడా రాజీవ్, శ్రవణ్‌లను పోలీసులు వేర్వేరుగా విచారణ జరుపుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో రెండు రోజుల కస్టడీకి తీసుకున్న పోలీసులు రాజీవ్ వద్ద ఎక్కువసేపు విచారణ జరిపారు. మంగళవారం శ్రవణ్‌ను లోతుగా విచారించనున్నారు. సోమవారం చంచల్ గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్న పోలీసులు, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన అనంతరం వారిని విడివిడిగా విచారించారు. విచారణ మొత్తాన్ని వీడియో తీస్తున్నట్టు తెలుస్తోంది. వీరిద్దరినీ వేర్వేరుగా విచారణ జరిపి.. వేర్వేరు స్టేషన్లలో ఉంచనున్నారు.