శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ESHWAR
Last Updated : ఆదివారం, 13 జులై 2014 (17:20 IST)

ఓటు తెలంగాణాలో - ఆవాసం ఆంధ్రాలో : ఇదీ ట్రైబల్స్ పరిస్థితి

ఖమ్మం జిల్లా భద్రాచలం డివిజన్లలో భద్రాచలం, పినపాక, అశ్వరావు పేట నియోజకవర్గాలు గందరగోళంగా మారనున్నాయి. ఈ మూడు నియోజకవర్గాల్లోని సగ భాగాలు సీమాంధ్రలో చేరుతున్నాయి. ఇలా ఈ గ్రామాలు సీమాంధ్రలో విలీనం అవుతుండటం పట్ల అక్కడి ప్రజల్లో గందరగోళం నెలకొంది. గత ఎన్నికల్లో ఈ  ఓటర్లు అందరూ తెలంగాణావాదానికి ఓటేసి గెలిపించారు.
 
అయితే ఇప్పుడు వీరంతా ఆంధ్ర ప్రాంతంలో కలవడం ఏమాత్రం ఇష్టపడటం లేదు. తమ ఓటేసి గెలిపించిన ప్రజాప్రతినిధులు తెలంగాణాలో ఉంటుంటే ఓటేసిని పాపానికి మేము ఆంధ్రలో చేరవలసి వస్తుందని బాధపడుతున్నారు. మా ఎం.ఎల్.ఎలు ఎం.పీలు తెలంగాణాలో ఉంటే  మా సమస్యలు సీమాంధ్రలోకి వెళ్లి ఏ నాయకుడుకి చెప్పుకోవాలంటూ నిలదీస్తున్నారు. 
 
అశ్వరావు పేట ఎమ్మెల్యేగా ఎంపికైన తాటి వెంకటేశ్వర్లుది వేలేరు పాడు మండలం కాగా ఆయన మండలం సీమాంధ్రలో చేరిపోతుంది. కానీ ఆయన మాత్రం తెలంగాణ శాసనసభకు ప్రాతినిథ్యం వహించాల్సి వుంది. ఇలా ఎన్నో గ్రామాల ప్రజలు పలు అనుమానాలతో తల్లడిల్లుతున్నారు. ఇటు తెలంగాణా ప్రభుత్వం, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు వీరి భయాన్ని పోగొట్టే చర్యలు తీసుకోవాలంటూ ప్రజాసంఘాల నేతలు కోరుతున్నారు.