శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 24 అక్టోబరు 2014 (16:54 IST)

ఆళ్లగడ్డ ఎన్నికల్లో భూమా అఖిల ప్రియ గెలుపు: హ్యాపీ!

ప్రధాన పార్టీలు పోటీ చేయకపోవడంతో పాటు ఇండిపెండెంట్లు నామినేషన్లను ఉపసంహరించుకోవడం వల్లే తాను ఆళ్లగడ్డ ఉప ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యానని భూమా అఖిల ప్రియ వినమ్రంగా తెలిపారు. 
 
ఆళ్లగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంపట్ల అఖిల ప్రియ హర్షం వ్యక్తం చేశారు. గెలిచిన సందర్భంగా పేదల కోసం పనిచేయాలనే తన తల్లి ఆశయ సాధన కోసం పాటుపడతానని హామీ ఇచ్చారు. 
 
కుటుంబ సభ్యులు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయనని అఖిల ప్రియ వ్యాఖానించారు. వైకాపా అధినేత జగన్ కు, నియోజకవర్గ ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.