శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 12 మార్చి 2017 (17:34 IST)

రాయల తెలంగాణ ప్రతిపాదన తొలుత చేసింది జేసీ కాదు.. భూమానే...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముక్కలు చేయాల్సి వస్తే.. రాయలసీమ ప్రాంతాన్ని తెలంగాణాలో కలిపి రాయల తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటూ తొలుత ప్రతిపాదన చేసింది భూమా నాగిరెడ్డే అనే విషయం ఇపుడు బయటకు వస్తోంద

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముక్కలు చేయాల్సి వస్తే.. రాయలసీమ ప్రాంతాన్ని తెలంగాణాలో కలిపి రాయల తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటూ తొలుత ప్రతిపాదన చేసింది భూమా నాగిరెడ్డే అనే విషయం ఇపుడు బయటకు వస్తోంది. ఈ తరహా ప్రతిపాదన చేసింది నాటి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న జేసీ దివాకర్ రెడ్డి అంటూ బాగా ప్రచారం జరిగింది. కానీ, ఆ ప్రతిపాదన చేసింది... జేసీ కాదనీ, భూమా నాగిరెడ్డి అని ఆయన సన్నిహితులు అంటున్నారు.
 
ఆదివారం తీవ్రమైన గుండెపోటుకు గురైన భూమా నాగిరెడ్డి కన్నుమూసిన విషయం తెల్సిందే. దీంతో ఆయనతో ఉన్న అనుబంధాన్ని పలువురు నేతలు నెమరు వేసుకుంటున్నారు. రాయల తెలంగాణ ప్రతిపాదనను తొలుత 2007లో వెల్లడించింది నాడు టీడీపీ నేతగా ఉన్న భూమా నాగిరెడ్డే. 
 
‘‘రాష్ట్ర విభజన తప్పనిసరి అయితే రాయలసీమను తెలంగాణతోనే కొనసాగించాలిగానీ ఆంధ్రతో వద్దు. రాయలసీమ ప్రజలు సాంస్కృతికంగా, మానసికంగా తెలంగాణ ప్రజలకు దగ్గరగా ఉంటారు’’ అని భూమా నాగిరెడ్డి అప్పట్లో తన ప్రతిపాదన వెనుకనున్న కారణాలు వివరించారు.
 
రాయలసీమ ప్రజలను ఆంధ్ర నేతలు మోసగించారని కూడా ఆయన ఆరోపించారు. శ్రీభాగ్ ఒప్పందాన్ని ఉదాహరణగా పేర్కొన్నారు. రాయలసీమ ప్రాంతం కూడా తెలంగాణ మాదిరిగా తీవ్ర కరవును, వెనుకబాటుతనాన్ని ఎదుర్కోంటోందన్నారు. ఈ రెండు ప్రాంతాలను గతంలో నిజాములు పాలించిన విషయాన్నీ ఆయన గుర్తు చేశారు. రాయలసీమ, తెలంగాణ ఒక విధమైన వెనుకబాటు తనాన్ని ఎదుర్కొంటుంటే... సహజ వనరులను కోస్టల్ ఆంధ్రా దోచుకుంటుందని ఆరోపించారు కూడా.