గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 13 మార్చి 2017 (09:09 IST)

భూమా నాగిరెడ్డి హఠాన్మరణం.. నేడు అంత్యక్రియలు.. రానున్న చంద్రబాబు - జగన్

హఠాన్మరణం చెందిన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అంత్యక్రియలు సోమవారం జరుగనున్నాయి. అధికారిక లాంఛనాలతో ఇవి పూర్తి చేయనున్నారు. ఈ అంత్యక్రియలకు ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర మంత్రులతోపాటు వైకాపా అధి

హఠాన్మరణం చెందిన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అంత్యక్రియలు సోమవారం జరుగనున్నాయి. అధికారిక లాంఛనాలతో ఇవి పూర్తి చేయనున్నారు. ఈ అంత్యక్రియలకు ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర మంత్రులతోపాటు వైకాపా అధినేత వైఎస్. జగన్ మోహన్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులంతా హాజరుకానున్నారు. ఈ అంత్యక్రియలు ఆళ్ళగడ్డలోని భూమా శోభా ఘాట్‌లో తన భార్య పక్కనే వీర నాగిరెడ్డి ఖననం జరుగనుంది. 
 
ఇదిలావుండగా, భూమా నాగిరెడ్డి నేత్రాలు దానం చేసేందుకు కుటుంబ సభ్యులు సమ్మతించారు. గతంలో రామకృష్ణా డిగ్రీ కళాశాలలో జరిగిన నేత్రదాన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని అంగీకారపత్రాలపై సంతకాలు చేశారు. ఆయన నిర్ణయం మేరకు నేత్రదానానికి కుటుంబ సభ్యులు అంగీకారం తెలిపారు. 
 
భూమా కుటుంబంలో వరుస విషాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఆయన తండ్రి ఫ్యాక్షన్‌ గొడవల్లో హత్యకు గురయ్యారు. 1989 శాసనసభ ఎన్నికల్లో నాగిరెడ్డి సోదరుడు వీరశేఖర్‌రెడ్డి టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. ఆయన అనారోగ్యంతో మరణించడంతో 1992లో జరిగిన ఉప ఎన్నికల్లో వీర నాగిరెడ్డి తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 
 
ఇక, రెండున్నరేళ్ళ కిందట ఆయన భార్య శోభ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చనిపోయారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున శోభా నాగిరెడ్డి ఆళ్లగడ్డ నుంచి పోటీ చేశారు. ఏప్రిల్‌ 23వ తేదీ రాత్రి.. చివరిరోజు ప్రచారాన్ని నంద్యాలలో ముగించుకొని ఆళ్లగడ్డకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. సురక్ష ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన విషయం తెల్సిందే.