బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 13 జనవరి 2017 (11:56 IST)

జగన్ తాత రాజారెడ్డి ఉసురు తీసింది చంద్రబాబే.. కడపతో సంబంధం లేని వారితో తిట్టిస్తారా?

వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాత రాజారెడ్డి ఉసురు తీసింది చంద్రబాబేనని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. ఇప్పుడు జగన్‌ను భౌతికంగా అంతమొందించేందుకు కుట్ర జరుగుతోందని ఆయన ఆందోళన వ్

వైకాపా అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నేతలు ఫైర్ అవుతున్నారు. జగన్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి జగన్‌పై సెటైర్లు వేశారు. బుధవారం పైడిపాలెం ఎత్తిపోతల ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జేసీ ప్రసంగిస్తూ వయసులో చిన్నవాడు.. చిన్నప్పటి నుంచి చూసినవాడు అనే ఉద్దేశంతో కొద్దిగా ఆప్యాయంగా ‘వాడు’ అని జగన్‌ను సంబోధించాను తప్ప పొగరుతో కాదన్నారు.
 
తాను అలా పిలవడాన్ని నిరసిస్తూ ఆయన పార్టీ నేతలు ధర్నాలు, దిష్టిబొమ్మల దహనాలు చేశారు. అందుకే ఇక నుంచి జగన్‌ను ‘వాడు’ అని సంబోధించనని, ‘శ్రీమాన్ జగన్మోహన్ రెడ్డి గారు’ అని సంబోధిస్తానని జేసీ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డికి ఆయన తాత గుణాలు వచ్చాయని విమర్శలు గుప్పించారు. 7వ తరగతి ఫెయిలైన వాడిని తాడిపత్రి ఇన్‌చార్జ్‌గా పెట్టారని ఎద్దేవా చేశారు. 
 
ఈ నేపథ్యంలో వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాత రాజారెడ్డి ఉసురు తీసింది చంద్రబాబేనని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. ఇప్పుడు జగన్‌ను భౌతికంగా అంతమొందించేందుకు కుట్ర జరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో కలిసి కుట్రలు చేసి జగన్‌ను జైలుకు పంపారని అన్నారు.
 
అప్పట్లో వైఎస్ ప్రారంభించిన ప్రాజెక్టులకు ఇప్పుడు బాబు రిబ్బన్లు కట్ చేస్తున్నారని భూమన ఎద్దేవా చేశారు. చంద్రబాబు కుల రాజకీయాలను పెంచి పోషిస్తున్నారన్నారు. కడప జిల్లాతో సంబంధం లేని నేతలను పిలిపించి మరీ జగన్‌ను వారితో తిట్టిపోయిస్తున్నారంటూ పరోక్షంగా జేసీ దివాకర్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.