గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : శుక్రవారం, 27 మార్చి 2015 (09:36 IST)

బలవంతంగా తీసుకునే హక్కులేదు... రాజధాని భూములపై హైకోర్టు తీర్పు

ప్రభుత్వం కోరినా ఇష్టంలేని రైతుల నుంచి బలవంతంగా భూము తీసుకునే హక్కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేదనీ, అలాంటి ప్రయత్నాలు చేయవద్దని సిఆర్డిఏ కమిషనర్ ను ఆదేశించింది. నూతన రాజధాని నిర్మాణంపై రైతులు హైకోర్టులో వేసిన పిటీషన్ పై కోర్టు తీర్పు చెప్పింది. తమ భూములను సిఆర్డిఏ బలవంతంగా లాక్కుంటోందని తమ పిటీషన్ లో పేర్కోన్నారు. పైగా పంటలు వేసుకోవడానికి వీలు లేదని ఆంక్షలు విధిస్తున్నట్లు చెప్పారు. 
 
దీనిపై విచారణ చేసిన కోర్టు రైతుల విషయంలో ఇబ్బందుల పాలు చేయడానికి లేదని అన్నారు. ఇష్టం లేని రైతుల పేర్లను వెంటనే లాండ్ పూలింగ్ నుంచి తొలగించాలని ఆదేశించింది. రాబోవు 15 రోజులలో నివేదిక సమర్పించాలని ఆదేశించింది.