శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 22 ఆగస్టు 2014 (13:32 IST)

పవన్ కళ్యాణ్ కి అమిత్ షా చేసిన ప్రతిపాదన అదేనా?

టాలీవుడ్ హీరో, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాను కలిసిన తరువాత అమిత్ షా తనకు ప్రతిపాదన చేసారని అన్నారు. ఐతే ఆ ప్రతిపాదన ఏమిటో ఇప్పుడే చెప్పనని అన్నారు పవన్. అమిత్ చేసిన ప్రతిపాదన ఏమిటనే ఆసక్తి కలిగినా అది పవన్ చెప్పేవరకూ సస్పెన్సే. ఇకపోతే ఇటీవల జరిగిన ఎన్నికలలో పవన్ కళ్యాణ్ ఎన్డీయే కూటమికి మద్దతు ఇచ్చి విజయానికి బాటలు వేశారు. ఇకముందు కూడా కూడా రెండు పార్టీలకు మద్దతు ఇవ్వాలని అమిత్ కోరి ఉంటారనే అనుకుంటున్నారు. అదే ఆ ప్రతిపాదన అని కూడా కొందరు అంటున్నారు.
 
ఇకపోతే తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కౌంటర్ల వర్షం కురిపిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కౌంటర్లతో ఆపుకోకుండా.. తెలంగాణలో కేసీఆర్‌కు చెక్ పెట్టే దిశగా పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా తమ పార్టీ తెలంగాణలో విస్తరింపజేసేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. 
 
ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ... రెండు రాష్ట్రాలపై జనసేన దృష్టి సారిస్తుందని పవన్ కల్యాణ్ గురువారం తెలిపారు. త్వరలో జరగనున్న ఉప ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై ఇంకా ఆలోచించలేదని అన్నారు. 
 
ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నానని చెప్పారు. రాష్ట్ర విభజన జరిగి రెండు ప్రభుత్వాలు ఏర్పడినప్పుడే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సామరస్య పూర్వకంగా చర్చలు జరిపి ఉంటే... సమస్యలన్నీ పరిష్కారమయ్యేవని అభిప్రాయపడ్డారు. 
 
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని... ఇది మంచిది కాదని అభిప్రాయపడ్డారు. బాధ్యత గల నాయకులెవరూ ఇలా వ్యవహరించరని... నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని చురక అంటించారు. ప్రజా సంక్షేమం కోసం ఆలోచిస్తే బాగుంటుందని పరోక్షంగా కేసీఆర్ కు హితవు పలికారు.